పార్లమెంట్ పోరు ప్రశాంతం

Fri,April 12, 2019 12:59 AM

(జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ) జిల్లా పరిధిలో పార్లమెంట్ ఎన్నికలు గురవా రం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరుగంటల వరకు కొనసాగింది. కొన్ని చోట్ల సాయంత్రం ఆరుగంటల వరకు పోలింగ్ బూత్‌లోకి వచ్చిన ఓటర్లు ఉండడంతో వారికి రాత్రి ఎనిమిది గంట ల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. జిల్లాలో నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో ని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు, పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలో ధర్మపురి నియోజకవర్గాలు పూర్తిగా ఉన్నాయి. చొప్పదండి, వేములవా డ నియోజకవర్గంలోని రెండేసి మండలాలు ఉ న్నా వాటిని జిల్లా పరిధిలోకి అధికారులు తీసుకురాలేదు. వాటిని వాటి నియోజకవర్గాల్లోనే ఉండే లా ఎన్నికల సంఘం అధికారులు ఉత్తర్వులు జా రీ చేశారు. జగిత్యాల నియోజకవర్గంలో మొత్తం 2,16,379 మంది ఓటర్లు ఉండగా, కోరుట్ల ని యోజకవర్గంలో 2,28,368 మంది ఓటర్లు ఉన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో 2,18, 484 మంది ఓటర్లు ఉన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో 1,51,549 ఓట్లు పోలు కాగా, కోరు ట్ల నియోజకవర్గంలో 1,57,238 ఓట్లు నమోదు అయ్యాయి. ధర్మపురి నియోజకవర్గంలో 1,50, 769 ఓట్లు పోలయ్యాయి. జిల్లాలోని మూడు ని యోజకవర్గాల్లో మొత్తంగా 6,58,229 ఓట్లు ఉండగా, 4,59,556 ఓట్లు పోలయ్యాయి. జగిత్యాల నియోజకవర్గంలో 68,673 మంది పురుషులు ఓటు హక్కును వినియోగించుకోగా, 82, 875 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక కోరుట్ల నియోజకవర్గంలో 88,712 మంది మహిళలు ఓటు వేయగా, 68, 526 మంది పురుషులు ఓటు వేశారు. ధర్మపురి నియోజకవర్గంలో 81,311 మంది మహిళలు ఓటు వేయగా, పురుషులు 69,458 మంది ఓటు వేశారు. పురుషుల కంటే మహిళలే అధికంగా ఓటు వేయడం ఈ సందర్భంగా గమనార్హం.

నిజామాబాద్ పరిధిలో 68.10శాతం
నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో 68.10శాతం పోలింగ్ నమోదైంది. ఈవీఎంల మొరాయింపు, సాంకేతిక లోపాలతో ఓటర్లు ఇ బ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి క్యూ లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ దశలో అధికారులపై ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశా రు. ఉదయం వేళల్లో ఈవీఎంల మొరాయిపుంతో పోలింగ్ మందకొడిగా సాగింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ వేగం పుంజుకున్నది. సాయం త్రం 6 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా ఓట్ల గల్లంతుపై ఎలాంటి ఆందోళనలు, ఫిర్యాదులు జరలేవు. పార్లమెంట్ స్థానం పరిధిలోని ఆర్మూర్ నియోజకవర్గంలో 70శాతం, బోధన్‌లో 71.79 శాతం, నిజామాబాద్ అర్బన్‌లో 52.50శాతం, నిజామాబాద్ రూరల్‌లో 71.53శాతం, బా ల్కొండలో 71.81, కోరుట్లలో 69.03 శాతం, జగిత్యాలలో 70.05శాతం పోలింగ్ నమోదైంది.

ఈవీఎంల అమరికతో ఇబ్బందులు..
పోలింగ్ బూత్‌ల్లో 12 ఈవీఎంలు పెట్టడంతో కొందరు ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. అధికారులను అడిగి ఓటువేశారు. ఒక్కో చోట ఒక్కో అమరికలో ఈవీఎంలు అమర్చారు. దీంతో కొంత ఓటర్లకు అసౌకర్యం ఏర్పడింది. వేసవితాపం తీవ్రంగా ఉండడం, కొంత మంది అనాసక్తి కారణంగా పోలింగ్ శాతం తగ్గినట్లు తెలుస్తోంది. నవీపేట మండలం పొతంగల్‌లో టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా పోలింగ్ నిర్వహణకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

అర్వింద్ దాదాగిరీ..
నిజామాబాద్ నగరంలోని శంకర్‌భవన్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి తన అనుచరులతో వచ్చిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ దాదాగిరీ చేశారు. అక్కడ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నా అనవసరంగా అధికారులతో, టీఆర్‌ఎస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. కొంతమంది అర్వింద్ అనుచరులు టీఆర్‌ఎస్ కార్యకర్తలపై చేయిచేసుకోవడంతో గొడవ ముదిరింది. స్థానికంగా ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురిని సముదాయించారు.

జగిత్యాల, కోరుట్లలో ప్రశాంతం..
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. జగిత్యాలలో 70.05శాతం, కోరుట్లలో 69.03శాతం పోలింగ్ నమోదైంది. ఈ రెం డు నియోజకవర్గాల్లో ఎక్కడా అవాంఛనీయ సం ఘటనలు చోటుచేసుకోలేదు. ఒకటి, రెండు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఓటింగ్ కార్డు ఉ న్నా అధికారులు ఏదైనా ఐడీకార్డు కావాలని ఓటర్లను ఇబ్బంది పెట్టిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఏ ఐడీకార్డు అవసరం లేకుండా ఓటు వేయవచ్చని ఆయన సూచించారు.

కరీంనగర్ పరిధిలో 69.40శాతం
కరీంనగర్ పార్లమెంట్ స్థానం పరిధిలో 69.40 శాతం పోలింగ్ నమోదైంది. లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు రాగా ఇం దులో అత్యధికంగా 73.79 శాతం పోలింగ్ మానకొండూరులో జరిగింది. కాగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 60.04 శాతం అతి స్వల్పంగా జరిగింది. 2014 జమిలి ఎన్నికల్లో 72.38 శాతం నమోదు కాగా ఇప్పుడు కేవలం లోక్‌సభ ఎన్నికలు జరిగిన సమయంలో 69.40 శాతం పోలింగ్ నమోదు కావడం గొప్ప విషయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ నియోజకవర్గంలో 60.04శాతం, చొప్పదండి 72.08శాతం, వేములవాడ 70.68శాతం, సిరిసిల్లలో 71.76శాతం, మానకొండూరులో 73.79శాతం, హుజూరాబాద్ లో 70.66, హుస్నాబాద్‌లో 71.09శాతం పోలింగ్ జరిగింది.

పురుషులకు మించి ఓట్లేసిన మహిళలు
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొ త్తం 16,50,893 ఓట్లు ఉండగా ఇందులో 8,15,230 మంది పురుషులు, 8,35,629 మంది మహిళా ఓటర్లున్నారు. నిజానికి ఓటర్ల సంఖ్య పరంగా చూసిన పురుషులకన్నా మహిళలే అధికంగా ఉన్నా ఓటింగ్‌కు వచ్చే సరికి మహిళా ఓటింగ్ తగ్గుతుందని భావించారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో మహిళలు బయటకు వచ్చి ఓటు వేయడానికి అనాసక్తి చూపుతారని అందరూ భావించారు. కానీ వాటిని లెక్క చేయకుండా పురుషులకు మించి ఓట్లు వేశారు. 68.51 శాతం పురుషులు ఓట్లు వేస్తే 70.28 శాతం మహిళలు ఓట్లు వేసి తమ చైతన్యాన్ని నిరూపించుకున్నారు. కాగా జగిత్యాల జిల్లా పరిధిలోకి వచ్చే మల్యాల మండలంలో 72శాతం, కొడిమ్యాలలో 69.8శాతం, కథలాపూర్‌లో 72.15శాతం, మేడిపల్లిలో 72.54 శాతం ఓటింగ్ జరిగింది.

పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 65.22శాతం
పెద్దపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలో 65.22 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 14,78, 062 మంది ఓటర్లుండగా వారిలో 8,36,034 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభానికి ముందు పలు చోట్ల వీవీ ప్యాట్లు, బ్యాలెట్, కంట్రోల్ యూ నిట్లు మొరాయించగా అధికారులు వెంటనే మరమతులు చేశారు. పార్లమెంట్ పరిధిలోని చెన్నూర్ నియోజకవర్గంలో అత్యధికంగా 71.62శాతం పోలింగ్ కాగా, రామగుండం నియోజకవర్గంలో అతి తక్కువగా 57.49శాతం పోలింగ్ నమోదైం ది. చెన్నూరులో 71,62శాతం, బెల్లంపల్లిలో 68.80శాతం, మంచిర్యాలలో 59.40శాతం, ధర్మపురిలో 69.14శాతం, రామగుండంలో 57.49శాతం, మంథనిలో 68.14శాతం, పెద్దపల్లిలో 68.59శాతం పోలింగ్ నమోదైంది. ఏడు శాసనసభ నియోజకవర్గాల్లోని 1,827 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈవీఎంలను పోలింగ్ ప్రక్రియ ముగియగానే ఆయా శాసనసభ నియోజకవర్గ కేంద్రాలకు తరలించి అక్కడి నుంచి పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం మంథని జేఎన్‌టీయూహెచ్‌కు తరలించారు.

పరిశీలించిన కలెక్టర్
లోక్ సభ ఎన్నికల సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు పోలింగ్ బూత్‌లు, తాటిపెల్లిలోని పోలింగ్ బూత్‌లను కలెక్టర్ ఏ శరత్, ఎస్పీ సింధూశర్మ పరిశీలించారు. పోలింగ్ కేంద్రా ల్లో సౌకర్యాల గురించి ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ విద్యార్థులు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ ద్వారా లైవ్ టెలీకాస్ట్ చేశారు.

ఫలించిన అధికారుల కృషి
ఓటింగ్ శాతం పెంచే విషయంలో అధికారులు చేసిన కృషి ఫలించింది. గతంలో ఏనాడూ పార్లమెంట్ ఎన్నికల్లో 60 శాతానికి మించి పోలింగ్ నమోదు కాలేదు. ఈ సారి అందుకు భిన్నంగా జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల్లో 70శాతం ఓటింగ్ సగటున నమోదు కావడం విశేషం. నిజామాబాద్ పరిధిలో అభ్యర్థులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 12 ఈవీఎం మిషన్లను తొ లిసారిగా ఉపయోగించారు. ఈ నేపథ్యంలో అధికారులు డివిజన్‌లో నమూనా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పదిరోజులుగా విస్తృతంగా ప్రచారం చేశారు. చాలా మంది ఓటర్లు ఇబ్బందులు లేకుండానే ఓట్లు వేశారు. కొన్ని పోలింగ్ బూత్‌లో ఈవీఎంలు మొరాయించాయన్న వ్యాఖ్యలు వినిపించినా, అధికారులు తొందరగా సమస్యలను పరిష్కరించి, పోలింగ్ సజావుగా సాగేలా చేశారు. పోలింగ్ శాతం పెంచేందుకు కలెక్టర్ శరత్, జగిత్యాల ఆర్డీఓ నరేందర్ చేపట్టిన ప్రచారం, అవగాహన తరగతులు ఫలించాయని పలువురు అభినందించారు.

76
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles