16స్థానాలు గెలుస్తాం

Fri,April 12, 2019 12:57 AM

జగిత్యాల రూరల్ : రాష్ట్రంలోని 16ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని నిజామాబాద్ పార్లమెంట్ స్థానం టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోసం జిల్లా కేంద్రంలోని బీట్‌బజార్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని గురువారం ఆమె పరిశీలించిన అనంతరం మా ట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ 16 స్థానాలు సాధిస్తుందనీ, మళ్లీ జగిత్యాల నుంచే జైత్రయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అర్బన్ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువ ఉంద నీ, విద్యావంతులు, పట్టణ ప్రజలు తప్పనిసరిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తొలిసారి ఓటు వేసే యువత తమ ఫస్ట్ ఓటును బెస్ట్ పార్టీని చూసి ఆలోచించి ఓటేయాలని సూచించారు. ఆమెవెంట జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఉన్నారు.

ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా?
కోరుట్లటౌన్: కోరుట్ల పట్టణం కల్లూరు రోడ్డు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని కల్వకుంట్ల కవిత పరిశీలించారు. బూత్‌లో పోలింగ్ సరళిపై సిబ్బందితో మాట్లాడారు. పోలింగ్ శాతంపై ఆరా తీసిన ఆమె సిబ్బం ది బాగోగులను అడిగి తెలుసుకున్నారు. భోజనాలు చేశారా?, ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటూ వాకబు చేశారు. కేంద్రంలో ఉన్న ఈవీఎంల వద్దకు అధికారుల అనుమతితో వెళ్లి పరిశీలించారు. అనంతరం అక్కడే ఉన్న పలువురు యువతులు కవితతో సెల్ఫీ దిగారు. అంతకుముందు పోలింగ్ కేంద్రం సమీపంలో బయట ఉన్న టీఆర్‌ఎస్ శ్రేణులను కలిసి ముచ్చటించారు. పోలింగ్ శాతం పెరిగేలా చూడాలని శ్రేణులకు సూచించారు. ఆమె వెంట ఎమ్మెల్యే కల్వకుంట్ల వి ద్యాసాగర్‌రావు, మున్సిపల్ అధ్యక్షుడు శీలం వే ణుగోపాల్, రాష్ట్ర నేత డాక్టర్ అనూప్‌రావు, మి ర్యాల వెంకటేశ్వర్‌రావు, పట్టణాధ్యక్షుడు అనిల్, కౌన్సిల్ సభ్యులు తదితరులున్నారు.

49
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles