కల్యాణ మండపానికి నిధులు మంజూరు చేస్తా

Fri,April 12, 2019 12:57 AM

గొల్లపల్లి: మండలంలోని వెనుగుమట్ల-అబ్బాపూర్ సరిహద్దులోని శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యా ణ మండపానికి అవసరమైన నిధులు మంజూర్ చేస్తానని మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు గురువారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై మొ క్కులు చెల్లించుకున్నారు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారిగా ఆలయా నికి వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఆలయ కమిటీ, అర్చకులు మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ల య కమిటీ మంత్రిని శాలువాతో సన్మానించింది. వద్ద పెళ్లిలు చేసేందుకు వసతి లేనివారు ఈ ఆలయం వద్ద పెళ్లిలు చేసుకుంటన్నారనీ, ఇక్కడ కల్యాణ మండపం ఏర్పాటు చేస్తే చుట్టు పక్కల నాలుగు గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని స్థానికులు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకుపోయారు.

దీనితో స్పందించిన మంత్రి కల్యాణ మండపానికి అవసరమైన స్థలం తీసుకోండనీ, మండప నిర్మాణానికి ఎన్ని నిధులైనే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆలయం పక్కనే ఉన్న స్థలం అమ్మేందుకు సిద్ధంగా ఉన్నదనీ, స్థానికులు మంత్రికి చెప్పగా ఆ స్థలాన్ని తీసుకోండనీ, నిధులు మంజూరు చేస్తానని పేర్కొన్నారు. కల్యాణ మండపానికి అవసరమైన స్థలా న్ని మంత్రి కొప్పుల పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రాంగోపాల్ రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ నారాయణ రెడ్డి, రెండు గ్రామాల సర్పంచులు కందుకూరి సత్తయ్య, గుడ్ల లక్ష్మి-రాజేశం, ధర్మకర్తలు లింగా రెడ్డి, సతీష్‌గౌడ్, శంకర్, అశోక్, దామోదర్ రావు, బగవంత రావు, హన్మాంతరావు, నాయకులు కమలాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles