నేడే పోలింగ్

Thu,April 11, 2019 12:44 AM

మెట్‌పల్లి,నమస్తేతెలంగాణ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బుధవారం పోలింగ్ జరగనున్నది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ కొనసాగనున్నది. ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి అధికార యంత్రాంగం ఏ ర్పాట్లు పూర్తి చేసింది. బుధవావారం నియోజకవర్గ కేంద్రం కోరుట్ల పట్టణంలోని ఎస్‌ఎఫ్‌ఎస్ (డిస్ట్రీబ్యూషన్ కేంద్రం) నుంచి ఎన్నికల సిబ్బందికి సామగ్రిని అందజేశారు. రూట్ల వారీగా సిబ్బంది ఈవీఎంలు, ఇతరాత్ర సామగ్రితో ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు సాయంత్రం చేరుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కోరుట్ల శాసన సభ నియోజకవర్గంలో 262 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, మరో ముగ్గురు సిబ్బందిని నియమించారు. వీరికి ఇప్పటికే రెండు విడతలుగా శిక్షణ ఇచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందు కు అటు ఎన్నికల అధికారులు, మరో వైపు పోలీస్ యం త్రాం గం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలతో పాటు ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల, మెట్‌పల్లి మండలాలు కలిపి మొత్తం ఓటర్లు 2,28, 368 మంది ఉండగా అందులో పురుషులు 1,09,131 మంది, మహిళలు 1,19,236 మంది ఓటర్లు ఉన్నారు.

ఓ టర్ల సం ఖ్యకు అనుగుణంగా 262 పోలింగ్‌కేంద్రాలకు ఏర్పాటు చేయ గా ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బంది కలుపుకొని మొత్తం 1310 మంది పోలింగ్ సిబ్బందిని, అదే విధంగా 3 ప్లయింగ్ స్కాడ్ టీఎంలు, 23 వెబ్‌లైవ్ కాస్టింగ్ సిబ్బంది, 52 మంది సెక్టోరల్ సిబ్బందిని ఉన్నతాధికారులు నియమించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12 బ్యాలెట్ యూనిట్లు (ఈవీఎం) ఉండగా,262 పోలింగ్ కేంద్రాలకు గాను 3144 ఈవీఎలను ఏర్పాటు చేశారు. మరో వైపు కిం ద శాసన సభ ఎన్నికల మాదిరిగానే ఈ సారికూడా నియోజకవర్గ కేంద్రం కోరుట్లలో బాలికల జూనియర్ కళాశాలలో మోడల్ పోలింగ్ కేంద్రం -165(మహిళా పో లింగ్ కేంద్రం) ఏర్పాటు చేశారు. దీనినే పింక్ కేంద్రంగా కూడా పిలుస్తారు. గురువారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు మాక్ పోలింగ్ అనంతర పోలింగ్ ప్రారంభమవుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అదే విధంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుం డా ఏర్పాట్లు చేపట్టారు. ఎండ తీవ్రత దృష్ట్యా పోలింగ్ కేం ద్రాల ఆవరణలో టెంట్లు, తాగునీటి వసతిని కల్పించారు.

మల్లాపూర్:మండలంలోని 23 గ్రామాల్లోని పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మండల వ్యాప్తంగా 50 పోలింగ్ కేంద్రాల్లో పురుషులు 18,561, స్త్రీలు 20,780 మంది 39,341 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఎస్‌ఐ పృథ్వీధర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తు న్నారు.

కోరుట్ల: మండలంలోని 15గ్రామాల్లో పార్లమెంటు ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లో నాలుగు రూట్లను ఏర్పాటు చేసి 38 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 190 మంది పొలింగ్ సిబ్బందిని నియమించారు. కాగా మండలంలో మొత్తం 29,529 ఓటర్లుండగా ఇందులో మహిళలు 15, 455, పురుషులు 14,074 మంది ఓటర్లున్నారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

మేడిపల్లి : మండలంలో 25 గ్రామాలుండగా 49 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ రాజేశ్వరి తెలిపారు. ఈవీఎంలతో పాటు ఎన్నికల సామగ్రిని తీసుకొని పోలింగ్ సిబ్బంది బుధవారం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. 18,107 పురుష, 20,050 మహిళా, ఇద్దరు ట్రాన్స్‌జెండర్స్‌లతో కలిపి మొత్తం 38159 మంది ఓటర్లు ఆయా పోలింగ్ కేంద్రాలలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తహసీల్దార్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకు అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సహకరించాలని కోరారు.

కథలాపూర్:గురువారం జరిగే ఎంపీ ఎన్నికల కోసం కథలాపూర్ మండలంలో బుధవారం ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలంలో 19 గ్రామాలుండగా 32,887 మంది ఓటర్లున్నారు. ఇందులో 15,484 మంది పురుషులు, 17,403 మంది మహిళ ఓటర్లున్నారు. వీరికోసం 41 పోలింగ్‌కేంద్రాలు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు మండలంలో 39 పోలింగ్ కేంద్రాలుండగా..ఈ ఎన్నికల కోసం కొత్తగా రాజారాం తండా గ్రామంలో ఒక పోలింగ్‌కేంద్రం, పెగ్గెర్ల గ్రామంలో అదనంగా పోలింగ్‌కేంద్రం ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ ఎండీ యూసుఫ్ తెలిపారు. పోలింగ్‌కేంద్రాలకు బుధవారం సాయంత్రం ఎన్నికల అధికారులు చేరుకున్నారు. కాగా బందోబస్తు కోసం వచ్చిన పోలీసులకు కథలాపూర్ ఎస్‌ఐ తీగల అశోక్ ప్రత్యేక చొరవ చూపి వాటర్ బాటిళ్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు బుధవారం పంపిణీ చేశారు. ఎండ ప్రభావం అధికంగా ఉండడంతో పోలీస్ సిబ్బంది దాహం తీర్చుకోవడానికి ఒక బాటిల్, వడదెబ్బకు గురికాకుండా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఇచ్చామని ఆయన తెలిపారు. కాగా ఎంపీ ఎన్నికల కోసం మండలానికి అదనంగా ఒక ఎస్‌ఐ, నలుగురు ఏఎస్‌ఐలు, 70 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని ఎస్‌ఐ వివరించారు.

54
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles