దేశానికే ఆదర్శంగా నిలవాలి

Thu,April 11, 2019 12:44 AM

కోరుట్లటౌన్: నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఎన్నికలు చారిత్రాత్మకమైనవని, ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ శరత్ పేర్కొన్నారు. పట్టణ శివారు ఎస్‌ఎఫ్‌ఎస్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన లోక్‌సభ ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఆయన బు ధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 262 పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బంది జాబితాను ఆయన పరిశీలించారు. హజరైన సిబ్బందికి అందించిన ఎన్నికల సామగ్రిపై ఆరా తీశారు. ఈమేరకు పో లింగ్ సి బ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికపై ఆసక్తి నెలకొందారు. రికార్డు స్థాయిలో 185 మంది అ భ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని దేశం దృష్టి ఎన్నిక నిర్వహణపై కేంద్రీకృతమై ఉంటుందన్నా రు. ప్రశాంత వాతావరణలో సజావుగా ఎన్నికల నిర్వహణకు కోరుట్ల నియోజకవర్గంలోని 262 ఎన్నికల పో లింగ్ కేంద్రాల్లో భద్రతపరమైన చర్యలు, వసతు లు సమకూర్చినట్లు ఆయన చెప్పారు. ప్రతి పోలిం గ్ స్టేషన్ వద్ద ప్రతి బ్యాలెట్ యూనిట్‌కు సంబందించి పోటీ చేసే అభ్యర్థుల వివరాలతో కూడిన ప్లేక్సీలను ఏర్పాటు చేశామని, ప్లేక్సీల్లో చూపించిన విధంగా పోలింగ్ కేంద్రంలో ఉన్న ఈవీఎంల్లో వరుస క్రమంలో వారి పోటో, ఎన్నికల గుర్తు ఉం టుందన్నారు. ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌లలో ఓటర్‌కు సులభంగా తాము ఓటు వేయబోయే అభ్యర్థులను గుర్తించే వీలుంటదని వివరించారు.

పో లింగ్ కేంద్రాల్లో ఈవీఎం మిషన్‌లలో సాంకేతిక పరపరమైన సమస్యలు పరిష్కరించేందుకు ఐదు పోలింగ్ కేంద్రాలకు కలిపి ఒక సెక్టార్ ఆఫీసర్, ఇంజినీర్ అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు. ఉదయం 3 గంటల నుంచి ఎన్నికల విధు ల్లో పాల్గొని 8 గంటలలోపు మాక్ పోలింగ్ పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా మెలగాలని, అలసత్వం వహించే ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు రాజస్థాన్‌కు చెందిన నేషనల్ లెవల్ మాస్టర్ ట్రెనర్స్ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. కాగా ఎన్నికల సిబ్బం ది, భద్రత సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద అధికారులు భోజన సదుపాయం కల్పించారు. 54 సెక్టార్లకు ఎన్నికల సామగ్రిని వరుస క్రమంలో అందించారు. సామగ్రిని తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎన్నికల సామగ్రిని తరలించేందుకు గాను ప్రత్యేక వాహనాన్ని సమకూర్చిన అధికారులు ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్‌లను దింపేందుకు కార్మికులను నియమించారు. కాగ కోరుట్ల నియోజకవర్గంలో మొత్తం 262 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 262 పీవో, ఎపీవో, 786 మంది ఓపీవోలతో పాటు మరో 8 మంది అదనపు సిబ్బందిని నియమించారు. ఎన్నికల్లో 262 వీవీ ప్యాట్‌లతో పాటు అదనంగా మరో 26, ఈవీఎంలు 3144, సీయూలు 262 ఏర్పాటు చేశారు. ఇక్కడ సబ్ కలెక్టర్ గౌతమ్ పోత్రూ, ఎలక్షన్ సీనియర్ ఆఫీసర్ భాస్కర్, డీఎస్పీ మల్లారెడ్డి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్‌పల్లి తహసీల్దార్లు, వివి ధ శాఖల ఎన్నికల అధికారులు ఉన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles