టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

Thu,April 11, 2019 12:44 AM

పెగడపల్లి:పెగడపల్లి మండలం ఎల్లాపూర్, కీచులాటపల్లి, రాజరాంపల్లికా చెందిన శ్రీరామ ఆటో యూనియన్ నాయకులు బుధవారం కరీంనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆటో యూనియన్ అధ్యక్షుడు ఇరుగురాల శ్రీనివాస్, సభ్యులు మరుకొండ మల్లారెడ్డి, గొల్లప్లి రాజమౌళి, లింగంపల్లి రాజ్‌కుమార్, ఇస్లావత్ రమేశ్, ఎట్టెం స్వామి, కో ట వెంకటేశం, పర్షరాం తదితరులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ చేరారు. ఇక్కడ నం చర్ల మాజీ సింగిల్‌విండో చైర్మన్ కాసుగంటి రాజేందర్‌రావు, ఎంపీటీసీ పులి రాజేశం, పార్టీ నాయకులు రాచకొండ ఆనందం, సాయిని రవి, ఇరుగురాల అజయ్, శ్రీనివాస్ తదితరులున్నారు.

గొల్లపల్లి: రాఘవపట్నం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బుధవారం కరీంనగర్ క్యాంప్ కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో కాంగ్రెస్ పా ర్టీ నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఉపసర్పంచ్ సింగిరెడ్డి మధుకర్ రెడ్డి, వార్డు సభ్యులు కంకణాల శ్రీనివాస్ రెడ్డి, కొలకాని జలందర్, చిట్యాల సాగర్, గంగవేణి అనిల్ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక్కడ సర్పంచ్ రాగం శంకరయ్య, ఉపసర్పంచి వొడ్నాల అంజనేయులు, బుర్ర తిరుపతి గౌడ్, కొలకాని పెద్ద రాజయ్య పాల్గొన్నారు.

తిప్పాయపల్లిలో..
కొడిమ్యాల: తిప్పాయపల్లి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువకులు 100 మంది పూడూర్ సింగిల్ విండో డైరెక్టర్ మ్యాకల మల్లేశం అధ్వర్యంలో బుధవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి చొప్పదండి ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్ కండువా కప్పి ఆహ్వానించారు. ఇక్కడ సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు,టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మేన్నేని రాజనర్సింగారావు,పార్టీ మండలాధ్యక్షుడు పులి వెంకటేశంగౌడ్, తదితరులున్నారు.

49
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles