కోటి ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యం

Wed,April 10, 2019 12:58 AM

పెగడపల్లి: సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సాగునీటి రం గానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారనీ, కోటి ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారని రాష్ట్ర సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని బతికపల్లిలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, రాష్ట్ర ఆర్థిక సం ఘం చైర్మన్ గొడిశెల రాజేశంగౌడ్‌తో కలిసి పెద్దపల్లి టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్‌నేతకానికి మద్ధతుగా మంత్రి ఈశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటల వి ద్యుత్ అందిస్తున్నది, దేశంలతో ఒక్క తెలంగాణనే అని, అలాగే రైతు బీమా, రైతు బంధు పథకాలు ముందుగా మనమే ప్రారంభించామనీ, వీటిని మిగతా రాష్ర్టాలు కాపీ కొడుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ర్టాన్ని 50 ఏళ్లు పాలించినా ఒక్క ప్రాజెక్టును కట్టలేదనీ, ప్రజ ల సంక్షేమం కోసం పని చేస్తున్న కేసీఆర్‌పై ప్రతి పక్షాలు విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. దేశంలో వారి పాలనపై ప్రజలు విసిగి పోయారనీ, చిన్న పార్టీల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారనీ, పార్లమెంట్ ఎన్నికల్లో సంకీర్ణం తప్పదన్నారు.

రాష్ట్రంలోని 16 మంది టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తే మన సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందనీ, ప్రజలంతా ఆ లోచించి నిర్ణయం తీసుకోవాలని మంత్రి కొప్పు ల ఈశ్వర్ పేర్కొన్నారు. మండలంలోని మద్దులపల్లి, బతికపల్లి, లింగాపూర్ గ్రామాలకు సాగు నీటి కొరత తీర్చేందుకు ఎస్సారెస్పీ నుంచి ఉప కాలువ నిర్మాణం త్వరలోనే చేపడాతామనీ, దీని వల్ల ఈ ప్రాంతం సశ్యశ్యామలం అవుతుందనీ, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పనులు ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు, ఎంపీపీ కాశెట్టి సత్తయ్య, పా ర్టీ మండలశాఖ అధ్యక్షుడు లోక మల్లారెడ్డి, వైస్‌ఎంపీపీ మాదారపు కరుణాకర్‌రావు, సర్పంచ్‌లు మేర్గు శ్రీనివాస్, కోరుకంటి రాజేశ్వర్‌రావు, కురుణాకర్‌రెడ్డి, కొండయ్య, లక్ష్మణ్, విండో చైర్మన్ నరేందర్‌రెడ్డి, పార్టీ నాయకులు క్యాస లక్ష్మీనారాయణరెడ్డి, మల్లారెడ్డి, రఘునందన్, మడిగెల తిరుపతి, కంటం రాయమల్లు, అందె వెంకన్న, మోహన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, రాజేందర్‌రావు, శ్రీనివాసరావు, బొంబాయి రాజిరెడ్డి, ఆనందం, వేణు, రాజు, ఆంజనేయులు, చిందం తిరుపతి, రమణారెడ్డి, నర్సింహరెడ్డి, చందు, రమేశ్, లోకేశ్, తిరుపతియాదవ్, లక్ష్మీనారాయణ, స్వాతి, పద్మ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యు లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles