మైక్రో అబ్జర్వర్ల ర్యాండమైజేషన్..

Wed,April 10, 2019 12:58 AM

జగిత్యాల కలెక్టరేట్ : లోక్‌సభ ఎన్నిక ల్లో భాగంగా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో సాధారణ పరిశీలకుడు డాక్టర్ గౌరవ్ దాహియా, కలెక్టర్ శరత్ మై క్రో అబ్జర్వర్ల ర్యాండమైజేషన్ నిర్వ హించారు. ఈ సంద ర్భంగా సాధార ణ పరిశీలకుడు గౌరవ్ దాహియా మైక్రో అబ్జర్వర్ల విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ లో ఈ నెల 11న లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున మీరంతా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయినందున ఎన్నికల కమిషన్ దగ్గర విధులు నిర్వ హించుచున్నారనీ, కావున మీకు కేటాయించిన పోలింగ్ స్టేషన్‌లో మాక్ పోల్ నిర్వాహణ, అక్కడ జరగ నున్న ఎన్నికల విధానం పై స్టేషన్‌లో ఏమైనా సమస్యలున్నా సాధారణ పరిశీలకులకు ఏఆర్వో, ఆర్వో ద్వారా రిపోర్టు ఫారాలు పూర్తిచేసి పంపాల న్నారు. కేవలం నిజామాబాద్‌కు ఈ నెల 11న జరిగే పోలింగ్ రోజున పో లింగ్ ఉదయం 8గంటల నుంచి సా యంత్రం 6గంటల వరకు మా ర్చారని తెలిపారు. పోలింగ్ స్టేషన్ లోని పరిసర ప్రాంతాల్లో పోలింగ్ విధానంపై సిబ్బందితోనే వెళ్లాలని, మీరు సైతం పోలింగ్ స్టేషన్‌లోనే నిద్రించాలని తెలిపారు. జాయింట్ కలెక్టర్ బేతి రాజేశం, డీఆర్వో అరుణ శ్రీ, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles