టీఆర్‌ఎస్‌కే మున్నూరు కాపుల మద్దతు

Tue,April 9, 2019 03:46 AM

మెట్‌పల్లి, నమస్తేతెలంగాణ : రాష్ట్ర వ్యాప్తంగా ము న్నూరు కాపులంతా టీఆర్‌ఎస్ వైపు ఉన్నారనీ, ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతివ్వడం జరుగుతున్నదని మున్నూరు కాపు పటేల్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మెట్‌పల్లి వచ్చిన ఆయన స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయ రంగంలో అత్యధిక మంది రైతులు మున్నూరుకాపు సామాజిక వర్గానికిచెందిన వారు ఉన్నారనీ, ప్రభుత్వం అమలు చేస్తోన్న రైతుబంధు, రైతు జీవిత బీమా, మరె న్నో రైతు సంక్షేమ పథకాలు, అదే విధంగా మున్నూరు కాపు కమ్యూనిటీ భవనాలు, కల్యాణ మండపాల నిర్మాణానికి గడిచిన ఐదేండ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదన్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గం సంక్షేమం, అభివృద్ధి కోసం సహకరిస్తున్న టీఆర్‌ఎస్‌కు మున్నూరు కాపులందరూ అండగా నిలిచి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించడంలో భాగస్వాములు కావాలని కోరారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ మున్నూరు కాపుల సంక్షేమం, అభ్యున్నతికి తమ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతున్నదన్నారు. నియోజకవర్గంలోనూ మున్నూరు కాపు సంఘ భవనాలు, కల్యాణ మండపాల నిర్మాణం కోసం నిధులు కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నదన్నారు. ప్రతి ఒక్కరూ ఎంపీ కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో జడ్పీటీసీ మాజీ సభ్యులు ఆకుల లింగారెడ్డి, మాజీ ఎంపీపీ నేరేళ్ల దేవేందర్, నాయకులు దేవ మల్లయ్య, ఏశవేణి గణేశ్, ఆకుల ప్రవీణ్, ఆకుల రాజరెడ్డి, ఆకుల శ్రీనివాస్, తెడ్డు సురక్ష ఆనంద్, నోముల గంగాధర్, శివ, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles