మైనార్టీలకు అండగా టీఆర్‌ఎస్ సర్కారు

Tue,April 9, 2019 03:46 AM

-కారు గుర్తుకే ఓటెయ్యాలి
-టీఆర్‌ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి తారీఖ్ అన్సారీ
కోరుట్లటౌన్: మైనార్టీలకు టీఆర్‌ఎస్ సర్కార్ అండ గా ఉంటున్నదనీ, తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు తగిన గౌరవం ఇస్తున్నదని టీఆర్‌ఎస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి తారీఖ్ అన్సారీ పేర్కొన్నారు. పట్టణంలోని టీఆర్‌ఎస్ నాయకులు అహ్మద్ అబ్దుల్ నయీమ్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 70 ఏళ్లలో అధికారంలో ఉన్న ఏ పార్టీలు కూడా ముస్లింల అభ్యున్నతి పాటు పడలేదనీ, ఓటు బ్యాంక్‌గా వాడుకొ ని వదిలేశాయని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభు త్వం అధికారం చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ చట్టసభల్లో సముచిత స్థానం కల్పించి ము స్లింపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారన్నారు. ఆరు కార్పొరెట్ పదవులు, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి లాంటి ఉన్నత పదవులు ముస్లింల కు కట్టబెట్టారని కొనియాడారు. ముస్లింల అభివృద్ధ్ది కోసం పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని చెప్పారు. ఎన్న డూ లేని విధంగా మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్న టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచి కారు గు ర్తుకే ఓటేసి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లోపాయికారి ఒప్పందంతో ముస్లింలను పక్కదారి పట్టించే ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. టీఆర్‌ఎస్‌కు 16 సీట్లు కట్టబెట్టడం ద్వారా కేంద్ర సర్కార్‌తో పోరాడే బ లం పెరిగి రాష్ట్ర హక్కులను సాధించుకునే అవకా శమివ్వాలన్నా రు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమావేశంలో ఫీఢ్ వెల్ఫెర్ సొసైటీ సీఈవో అజీమ్ ఖాన్, ఎన్నారై యూకే తెలంగాణ ఎగ్జిక్యూటివ్ మెంబర్, బాబూఖాన్ ట్రస్ట్ ప్రతినిది సైఫ్ మహ్మద్ ఖాన్, నాయకులు ఎంఏ నయీమ్, రుద్ర శ్రీనివాస్ పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles