కవితను మళ్లీ ఆశీర్వదించండి

Tue,April 9, 2019 03:45 AM

సారంగాపూర్ : మీ సంక్షేమమే మా సంకల్పం మరోసారి ఎంపీగా కవితక్కకు అవకాశం ఇచ్చి ఆ శీర్వదించండని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కు మార్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల్లోని నాగునూర్, లచ్చక్కపేట, సారంగాపూర్, తుంగూర్, నర్సింహులపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామా ల్లో ఆయన మాట్లాడుతూ గత పాలకులు రైతాంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమ పథ కం ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన రైతుబీమ పథకంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. బీర్‌పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్ట్ ఆదునీకీకరణకు ప్రభుత్వం 60కోట్లు మంజూరీ చేయగా పనులు కొనసాగుతున్నాయన్నారు. ప్రాజెక్ట్ పనులు పూర్తి అయితే బీర్‌పూర్, ధర్మపురి మండలాలకు సాగు, తాగు నీటి ఇబ్బందులు తప్పుతాయన్నారు. రాష్ట్రంలోని గిరిజన తండాలనను ప్రత్యేక పంచాయతీలుగా మర్చారనీ, రైతులకు 24గంటల విద్యుత్ సరఫరా, పంట పెట్టుబడి, సకాలంలో ఎరువులు, రుణమాఫి, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, పింఛన్లు, ఇంటింటా స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు మిషన్ భగిరథ, చెరువుల మరమ్మతులకు మిషన్ కాకతీయ, కేసీఆర్ కిట్లు, అన్ని కులాలకు ఆత్మగౌరవ సంఘ భవనాల మంజూరి, ఇలా చేప్పుకుంటు పోతే ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఉన్నాయన్నారు.

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని ఎన్నో కొత్త పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ఎంపీ కల్వకుంట్ల కవితక్క మన ఊరు మన ఎంపీ కార్యక్రమాల్లో ఊరూర తిరుగుతు సమస్యలు తెల్సుకుని వాటిని పరిష్కరించారన్నారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా తన ఫార్లమెంట్ పరిధిలో ఎన్నో అభివృద్ది పనులు చేస్తు దేశంలోనే ఆదర్శ ఎంపీగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. కేంద్రంలో గులాబీ నాయకులు ఉంటేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. నిజామాబాద్ ఎంపీగా మరొక్క సారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తారన్నారు. ఆయా గ్రామాల్లో ప్రజలు కవితక్క గెలుపు ఖాయమంటూ భరోషాను ఇస్తూ ఇంటింటికీ తిరుగుతూ ప్రచారాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ కొల్ముల శారద, సింగిల్ విండో చైర్మన్లు ముప్పాల రాంచందర్ రావు, సాగి సత్యం రావు, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు కొల్ముల రమణ, మండల పార్టీ అధ్యక్షుడు నారపాక రమేశ్, గుర్రాల రాజేందర్ రెడ్డి, రైతు సమన్వమ సమితి మండల కన్వీనర్ మెరుగు రాజేశం, కోల శ్రీనివాస్, మాజీ జడ్పీ సభ్యురాలు ము ప్పాల జలజ, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles