16 సీట్లు గెలిపిస్తే దేశంలో పెనుమార్పు

Tue,April 9, 2019 03:45 AM

-కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
-టీఆర్‌ఎస్‌లో చేరిన 300 మంది ముదిరాజ్‌లు
మెట్‌పల్లి టౌన్: రాష్ట్రంలో 16ఎంపీ సీట్లు టీఆర్‌ఎస్ పార్టీవి గెలిపిస్తే దేశ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించనున్నాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. పట్టణంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ ఆర్. సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలం వేములకూర్తి, కోమటి కొండపూర్ గ్రామాలకు చెందిన ముదిరాజ్ సంఘం నా యకులు, యువజన సంఘాల సభ్యులు 300 మంది వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరా రు. ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ గ్రామ సర్పంచ్ జంగిటి అంజయ్య టీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం మెట్‌పల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వారికి గులాబీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఎంపీగా కవిత ఐదేళ్లలోని పార్లమెంట్‌లో తెలంగాణ వాణిని వినింపించి రాష్ర్టానికి రావాల్సిన ఎన్నో నిధులను కేంద్ర ప్రభుత్వంచే మంజూరు చేయించారన్నారు. తనకు సహకరిస్తూ కోరుట్ల నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతూ బీమా, కల్యాణలక్ష్మి, సాదీ ముభారక్ వంటి పథకాలు నిరుపేదలకు ఎంతో మేలు చేకుర్చాయన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ పట్టణాలతో పాటు గ్రామాల్లో నాయకు లు, కార్యకర్తలు ప్రచారం చేయాలన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితను భారీ మె జార్టీతో గెలుపించాడనికి పార్టీలో చేరిన ముదిరాజ్ సంఘాల నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్ పార్టీ మండలశాఖ అధ్యక్షుడు ఏలాల దశరథ్‌రెడ్డి, మేడిపెల్లి, రాజేశ్వర్ రావుపేట సర్పంచ్‌లు ఫిసు తిరుపతిరెడ్డి, శ్రీధర్, ఎంపీటీసీ కందిరి ప్రతాప్‌రెడ్డి, మాజీ సర్పంచ్ జంగస్వామి, టీఆర్‌ఎస్, ముదిరాజ్ నాయకులు కట్కం నర్సరెడ్డి, జయరాజు, జంగిటి శ్రీధర్, రాజేందర్, రవికుమార్, రమేశ్ గౌడ్, గం గాధర్, రాజేశ్వర్, చక్రపాణి, భూమన్న, బక్కన్న, రాజేశ్, రాకేశ్, రాజు, జలేందర్ ఉన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles