ఢిల్లీని శాసిద్దాం..

Mon,March 25, 2019 01:24 AM

- 16మంది ఎంపీలను గెలిపిస్తే 116మంది ఎంపీలతో చక్రం తిప్పుదాం
- జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌దే కీలక పాత్ర
- ఐదేళ్లలోనే 70ఏళ్ల అభివృద్ధి చేసి చూపించాం
- నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో రూ.15వేల కోట్లు ఖర్చు చేశాం
- ప్రతి ఎన్నికల్లోనూ గులాబీ పార్టీకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
- దేశంలో నంబర్ వన్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంపిక హర్షణీయం
- రాష్ట్రంలో 16ఎంపీ స్థానాలను కేసీఆర్‌కు కానుక ఇవ్వండి
- త్వరలోనే మల్లాపూర్ సోమన్న గుట్టపైకి ఘాట్ రోడ్డు వేయిస్తా
- కాలినడకన కొండెక్కి మొక్కులు చెల్లిస్తా
- సోషల్ మీడియాలో బీజేపీ అసత్య ప్రచారాలను నమ్మొద్దు
- మరోసారి ఆశీర్వదిస్తే కోరుట్ల నియోజకవర్గంలో అర్హులందరికీ డబుల్ ఇండ్లు
- నిజామాబాద్ పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత
- కవితను ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో కీలక మంత్రి కావడం ఖాయం
- కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
- మల్లాపూర్, మొగిలిపేట, సిరిపూర్‌లో రోడ్ షో
- గ్రామగ్రామాన ప్రజల ఘన స్వాగతం

మల్లాపూర్ : రాష్ట్రంలో 16ఎంపీ సీట్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుక ఇస్తే ఆయన రాజకీయ చతురతతో 116మంది ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తారని నిజామాబాద్ పార్లమెంట్ స్థానం టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం మల్లాపూర్ మండల కేంద్రం, మొగిలిపేట, సిరిపూర్‌లో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి రోడ్ షో నిర్వహించా రు. ఆయా గ్రామాల్లో ఆమె మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఎంపీగా 11సార్లు కాంగ్రెస్ వాళ్లు, మూడు సార్లు టీడీపీ వాళ్లు పనిచేశారు.. సుమారు 70ఏళ్లకు పైగా ఆ పార్టీల నాయకులు ఎంపీలుగా పనిచేసినా కానీ చెప్పకోదగ్గ అభివృద్ధి ఎక్కడా చేయలేదనీ, తనపై నమ్మకంతో గెలిపించిన వారి ఆశలను వమ్ముచేయకుండా కేవలం ఐదేళ్లలోనే అందరి సహకారంతో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో రూ.15వేల కోట్లతో అభివృద్ధి పనులు చేసి చూపించిన ఘనత కేవలం టీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో లేవనీ, రాష్ట్రంలో 16మంది ఎంపీలను గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇస్తే, తన రాజకీయ చతురతతో 116మంది ఎంపీలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తారని స్పష్టం చేశారు. ఇటీవల దేశంలో నిర్వహించిన ఓ సర్వేలో సీఎం కేసీఆర్ మొదటి స్థానంలో నిలిచారనీ, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈఘనత దక్కడం హర్షణీయమని కొనియాడారు.

ప్రతి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మాయ మాటలు నమ్మకుండా టీఆర్‌ఎస్‌కే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న నిరంతర విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, ఆసరా, బీడీ కార్మికుల పింఛన్ తదితర పథకాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో కూడా లేవని గుర్తుచేశారు. అందరి సహకారంతో ఇప్పటికే తన వంతు పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలనూ అభివృద్ధి చేయడంతో పాటు, సింగరేణి, పసుపుబోర్డు, హైకోర్టు సాధన, రైల్వేలైన్ పనులకు నిధుల మంజూరు తదితర సమస్యలపై పార్లమెంట్‌లో ప్రస్తావించాననీ, మరోసారి ప్రజలు పెద్ద మనసుతో ఆశీర్వదించి తనను ఎంపీగా గెలిపిస్తే కోరుట్ల నియోజవర్గ వ్యాప్తంగా ఇండ్లు లేని ప్రతి నిరుపేదకూ తప్పనిసరిగా డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మల్లాపూర్ మండలంలో ప్రసిద్ధిగాంచిన కనక సోమేశ్వర కొండపైకి త్వరలోనే ఘాట్‌రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తాననీ, కొండ పైకి కాలినడకన ఎక్కి సోమన్నకు మొక్కులు చెల్లిస్తానని తెలిపారు. బీజేపీ నాయకులు పనికట్టుకొని టీఆర్‌ఎస్‌పై సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు.

కవిత కేంద్ర మంత్రి కావడం ఖాయం : విద్యాసాగర్‌రావు
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ గతంలో ఎంపీగా రెండు సార్లు గెలిచిన మధుయాష్కీగౌడ్ కనీసం ప్రతి మండలానికి రెండు గ్రామాలు సైతం తిరగలేదనీ, ఇలాంటి నాయకులను ప్రజలు ఎలా నమ్ముతారన్నారు. కేవలం ఎన్నికలప్పుడే కనిపించే నాయకులకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం టీఆర్‌ఎస్ ఆభ్యర్థి కల్వకుంట్ల కవితను భారీ మోజార్టీతో గెలిపిస్తే కేంద్రంలో కీలక మంత్రి కావడం ఖాయమాని స్పష్టం చేశారు.

గ్రామగ్రామాన ఘన స్వాగతం
లోక్‌సభ స్థానం టీఆర్‌ఎస్ ఆభ్యర్థి కల్వకుంట్ల కవితకు గ్రామగ్రామాన ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులు, బతుకమ్మలు, నృత్యాలతో స్వాగతించారు. మొగిలిపేటలో తెలంగాణ జాగృతి యువత జిల్లా అధ్యక్షుడు గణవేని మల్లేశ్‌యాదవ్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీతో స్వాగతం పలికారు. కార్యక్రమాల్లో మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు దేవ ముత్తమ్మ, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావు, జిల్లా సభ్యుడు దేవ మల్లయ్య, మండలాధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ఏనుగు రాంరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తోట శ్రీనివాస్, సర్పంచులు భూక్య గోవింద్‌నాయక్, వనతడపుల నాగరాజు, మాజీ సర్పంచ్ గోపిడి రాజరెడ్డి, ఎంపీటీసీలు దండవేని వెంకవ్వ, పెంటపర్తి లక్ష్మి, మొరపు గంగారాజం, డబ్బ రాజరెడ్డి, నాయకులు కాటిపల్లి ఆదిరెడ్డి, బదినపల్లి ప్రేమ్, తెడ్డు ఆనంద్, ప్రవీణ్, మోహన్‌రెడ్డి, రాజరెడ్డి, అంజిరెడ్డి, లక్ష్మణ్, రమేశ్‌రెడ్డి, శరత్, సురేశ్, జీవన్, లింగస్వామి, నారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్‌విండో చైర్మన్లు, గ్రామశాఖ అధ్యక్షులు, కార్యకర్తలు, తెలంగాణ జాగృతి నాయకులు పాల్గొన్నారు.

66
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles