కేంద్రంలో టీఆర్‌ఎస్‌కీలకం

Mon,March 25, 2019 01:23 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: ఈ ఎన్నికల అనంతరం కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ కీలకంగా మారుతుందనీ, టీఆర్‌ఎస్ మద్దతు లేకుండా ప్ర ధాని ఎన్నిక అయ్యే పరిస్థితి ఉండదని ఎంపీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం తన నివాసం లో టీఆర్‌ఎస్ నాయకుడు శ్రీరాం మధుకర్ నేతృత్వంలో రూపొందించిన టీఆర్‌ఎస్ ప్రచార సిడీని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రచారాన్ని మరింతగా పెంచాలన్నారు. రాష్ట్రంలో 3 వేల కిలోమీరట్లకుపైగా జాతీయ రహదారులను తీసుకువచ్చామన్నారు. కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ తీసుకువచ్చామనీ, ఇప్పటికే రూ. 250 కోట్లతో ప నులు సిద్ధంగా ఉన్నాయనీ, కొత్తపల్లి, మనోహరబాద్ రైల్వే పనుల కోసం రూ. 750 కోట్లు మం జూరయ్యాయన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని ఫెడరల్ ఫ్రంట్ వైపుగా ప్రాంతీయ పార్టీలు చూస్తున్నాయన్నారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వా లు మాత్రమే ఏర్పాటవుతాయనీ, కేంద్ర రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలుచుకొని రా ష్ర్టానికి రావాల్సిన నిధులు, హక్కుల సాధనలో కేంద్రం మెడలు వంచి సాధించుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, నాయకులు వీర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles