టీఆర్‌ఎస్‌లోకి పలు పార్టీల నాయకులు

Mon,March 25, 2019 01:23 AM

మల్యాల : మండలంలోని తక్కళ్లపెల్లి ఉప స ర్పంచ్ మంద మహేశ్ గౌడ్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరగా ఆదివారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మా ట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పలు సంక్షేమ పథకాలు, పలు ప్రాజెక్టుల అభివృద్ది వల్లే వివిధ పార్టీలకు చెం దిన నాయకులు సైతం టీఆర్‌ఎస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. ఈ క్రమంలోనే మంద మహేశ్ గౌడ్ బీజేపీలో కొనసాగుతుండగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపగా పార్టీలోకి ఆహ్వానించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తైదల శ్రీలత, తక్కళ్లపెల్లి సర్పంచ్ గొడు గు కుమార స్వామి, టీఆర్‌ఎస్ నాయకులు జన గాం శ్రీనివాస్, ఆగంతం వంశీ, సుధాకర్ గౌడ్, ఉత్తెం గంగాధర్, కంటం గంగారాజం, మంద మ ధు, శంకర్ గౌడ్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.

కొడిమ్యాల: మండలంలోని చెప్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఊట్కూరి కర్ణాకర్‌రెడ్డి, గుజ్జుల సునీల్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, సంజీవరెడ్డి, మధూకర్‌రెడ్డి, సత్యంరెడ్డి, ల చ్చిరెడ్డి, నరేశ్, రా జుతోపాటు 50 మంది టీఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారికి చొప్పదం డి ఎమ్మెల్యే రవిశంకర్ పార్టీ కం డువా కప్పి ఆహ్వానించారు. మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, టీఆర్‌ఎ స్ పార్టీ రాష్ట్ర నాయకులు మేన్నేని రాజనర్సింగరా వు, పార్టీ మం డలాధ్యక్షుడు పులి వెంకటేశంగౌడ్, సర్పంచ్ ఊట్కూరి రాజశేఖర్‌రెడ్డి, ఉన్నారు.

కాంగ్రెస్ సర్పంచ్ టీఆర్‌ఎస్‌లో చేరిక
రాయికల్ : రాయికల్ మండలం తాట్లవాయి కాగ్రెస్ సర్పంచ్ రాగి సాగరిక, 20 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సమక్షంలో అదివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామా ల్లో కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఎంపీ కవితను భారీ మెజార్టీతో మరోసారి గెలిపించేందుకు కార్యకర్తలు విసృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

48
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles