మండు వేసవిలోనూ నిండు కుండలా..

Sun,March 24, 2019 12:34 AM

పెగడపల్లి : మండు వేసవిలోనూ మద్దులపల్లి చెరువు జలకళను సంతరించుకుంది. ఎస్సారెస్పీ నీటి విడుదలతో మండు వేసవిలోనూ చెరువు నిండు కుండను తలపిస్తున్నది. శనివారం చెరువు పూర్తి స్థాయిలో నిండడంతో అలుగు (మత్తడి) పారి, కాలువ నుంచి లింగాపూర్ చెరువులోకి నీరు చేరుతుంది. దీంతో ఆయకట్టు పరిధిలోని ఆరవల్లి, బతికపల్లి, సుద్దపల్లి గ్రామాలకు చెందిన రైతులకు చివరి దశలో ఉన్న సుమారు ఆరువందల ఎకరాల్లో వరి పంటలకు సాగునీరు అందుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మూడు విడతలుగా వదిలిన ఎస్సారెస్పీ కాలువ నీటితో మద్దులపల్లి చెరువు అలుగు పారుతుండడంతో ఆయకట్టు పరిధిలోని రైతులు నీటి కష్టాలు తీరినట్లేనని చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి మరొక తడి కాలువ నీరు వదలడంతో చివరి పంటలకు ఢోకా లేదని రైతులు పేర్కొంటున్నారు. దీనికి తోడు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు ఐతుపల్లి పెద్ద చెరువులోకి వారం రోజులుగా ఎల్లంపల్లికి చెందిన నారాయణపూర్ రిజర్వాయర్ నీరు వచ్చి చేరుతున్నది. మరో నాలుగు రోజుల్లో చెరువు పూర్తిగా నిండి అలుగు పారి ఇందులోని నీళ్లు కూడా మద్దులపల్లి చెరువులోకి రానుండడంతో ఇక సాగునీటి తిప్పలు తప్పిన ట్టేనని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

59
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles