పౌష్ఠికాహారంతో పరిపూర్ణ ఆరోగ్యం

Sun,March 24, 2019 12:34 AM

వెల్గటూరు: పోషకాహారం తీసుకోవడం ద్వారానే పరిపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. శనివారం మండలంలోని పైడిపెల్లిలో గల అంగన్ కేంద్రం-1లో పోషణ్ అభియాన్ పక్షోత్సవాల్లో భాగంలో బాలింతలు, గర్భిణులు, పిల్లల తల్లులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతాలు చేశారు. పిల్లల బరువును, ఎత్తు ను కొలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డు తూ గర్భిణులు, బాలింతలు రక్తహీనత నివార ణకు సమత్యులమైన ఆహారం తీసుకోవాలని కో రారు. ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న ఐరన్ ట్యాబ్లెట్లను వాడాలని సూచించారు. ప్రతి నెలా గర్భిణులు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగేలా చూసుకోవాలన్నారు. అదేవిధంగా వెల్గటూరులో గల 1వ సెంటర్‌లో ఈసీసీఈ డే సందర్భంగా పిల్లలకు అంగన్‌వాడీ టీచర్ శంకరమ్మ సాంస్కృ తిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమం లో అంగన్‌వాడీ టీచర్ పద్మ, సర్పంచ్ గంగుల నగేశ్, ఉపసర్పంచ్ చేపూరి జ్యోతి, వీవో అధ్యక్షురాలు రాజమణి, అంబారిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

తల్లులకు అవగాహన..
పెగడపల్లి: మండలంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో శనివారం ఈసీసీఈ దినోత్సవాన్ని ని ర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అం దించే పోషకాహారం, ఆట పాటలతో కూడిన చదు వు, గర్భిణులు, బాలింతలకు అందించే ఆరోగ్య పోషకాహారం, విటమిన్ల మాత్రలు, తీసుకోవా ల్సి న జాగ్రత్తలపై అంగన్‌వాడీ టీచర్లు, తల్లులకు వివరించారు. ఇక్కడ అంగన్‌వాడీ ఆయాలు ఉన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles