జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Sun,March 24, 2019 12:34 AM

ధర్మారం: జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభు త్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం ధర్మారం మండలకేంద్రంలోని టీయూడబ్ల్యూజే-హె చ్ 143 యూనియన్ పాత్రికేయులు, రాష్ట్ర యూనియన్ నాయకులు మంత్రిని కరీంనగర్‌లోని ఆయన స్వగృహంలో కలిశారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించను న్న యూనియన్ ఉమ్మడి జిల్లా మహాసభను రాష్ట్ర యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వారు ఈశ్వర్‌కు వివరించారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మంత్రి ఈశ్వర్‌ను యూనియన్ నాయకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే-హెచ్ 143 ఉమ్మడి జిల్లా మహాసభ పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం పాత్రికేయుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయటంతో పాటు బీమా తదితర సౌకర్యాలను కల్పించిందని ఆయన వివరించారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బిజిగిరి శ్రీనివాస్, ధర్మారం యూనియన్ అధ్యక్షుడు దేవి రాజమల్లయ్య, పెద్దపల్లి జిల్లా కో కన్వీనర్ తన్నీర్ రాజేందర్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఊరెడి రవీందర్, రావుల సత్యం, రిఫికేశ్, గాండ్ల స్వామి, లింగంపల్లి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles