అఖండ విజయం అందిస్తాం

Sun,March 24, 2019 12:33 AM

మెట్‌పల్లి టౌన్: నిజామాబాద్ పార్లమెంట్ ని యోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితను తెలంగాణలోనే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. పట్టణంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం జిల్లా వంజరి కుల సంఘం అ ధ్యక్షుడు బొమ్మెల శంకర్, మెట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణాధ్యక్షుడు ద్యావనపెల్లి రాజ రాం, రజక సంఘం, యువజన విభాగం నాయకుడు పిప్పెర రాజేశ్ అధ్వర్యంలో సుమారు 550 మంది వివిధ పార్టీల నుంచి వంజరి సంఘం నా యకులు, యువలకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం మండలంలోని గోధూర్, యామపూర్, తి మ్మపూర్ తండా, కోత్తూర్, కేశావపూర్, ములరాంపూర్ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వా ర్డు సభ్యులు ఎమ్మెల్యే సమక్షంలో టీఅర్‌ఎస్ పార్టీలో చేరారు. అనంతరం టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార రథాలను ఎమ్మెల్యే కల్వకుంట్ల జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు, యువకులతో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రం లో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందన్నా రు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో సాధించిన ఓట్ల కంటే ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సా ధించేలా కృషి చేయాలని సూచించారు. గతంలో ఏ ఎంపీ చేయని విధంగా కవిత ఎంపీగా పట్టణాలతో పాటు గ్రామాల్లో అభివృద్ధి చేసి చూపారన్నారు.

నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాడనికి ఎంపీ కృషి చేశారన్నారు. తెలంగాణ ప్రభు త్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు సైతం రాష్ట్రంలో మారోమారు టీఆర్‌ఎస్ ఎంపీలకు ప ట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ తరఫున పోటీ చేసేందుకే అభ్యర్థులు లేని పరిస్థితులున్నాయన్నా రు. 16 ఎంపీ స్థానాలు కైవసం చేసుకొని కేం ద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ కీలకం కాబోతుందన్నా రు. ఎన్నికలకు 19 రోజుల గడువు ఉందని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీంటిని ప్ర జల్లోకి తీసుకెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత ఘన విజయం సాధించడానికి ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. అనంతరం ఎ మ్మెల్యే విద్యాసాగర్‌రావును పార్టీలో చేరిన ప్రజాప్రతినిధులు, కుల సంఘాల సభ్యులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఇ క్కడ టీఆర్‌ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు బర్ల సాయ న్న, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యుడు మా రు సాయిరెడ్డి, రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పెర శేఖర్, పద్మాశాలీ సంక్షేమ సంఘం పట్టణాధ్యక్షుడు కేసుల సురేందర్, మాజీ మున్సిపల్ ఉపాధ్యక్షుడు మార్గం గంగాధర్, టీఆర్‌ఎస్ వంజరి సంఘంనాయకులు ఏలాల దశరథ్‌రెడ్డి, నర్సింహులు, గుగ్గిళ్ల సురేశ్‌గౌడ్, లింగంపెల్లి సం జీవ్, ఏషమేని గణేశ్, షేక్ నవాబ్, గైని శ్రీనివాస్‌గౌడ్, నల్ల తిరుపతిరెడ్డి, పన్నాల మాధవరెడ్డి, అంగడి పురుషోత్తం, ఎండీ జావీద్, బత్తుల భర త్, భీమానతి సత్యం, యుగేంధర్, బానుమూర్తి, పుల్ల జగన్‌గౌడ్, గుండు గోపాల్, జాజల జగన్‌రావు, నేమూరి సత్యనారాయణ, బలరాం, రవింధర్, గంగాధర్, భూమయ్య, సుధాకర్, నారయణ, వేణు, తుక్కరాం, తదితరులున్నారు.

37
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles