ఎమ్మెల్సీ పోరు.. ప్రశాంతం

Sat,March 23, 2019 01:31 AM

- ముగిసిన రెండు స్థానాల ఎన్నికలు
- పట్టభద్రులకు 59.03శాతం.. ఉపాధ్యాయకు 83.54శాతం పోలింగ్
- ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు
- అత్యధికంగా తూప్రాన్ డివిజన్‌లో ఓటింగ్
- అత్యల్పంగా నిజామాబాద్ డివిజన్‌లో..
- కరీంనగర్ అంబేద్కర్ స్టేడియానికి బ్యాలెట్ బాక్సులు
- ఈ నెల 26న ఫలితాలు
- అప్పటిదాకా అభ్యర్థులకు ఎదురుచూపులే..

కరీంనగర్/జగిత్యాల, ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మండలి సమరం ముగిసింది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓటింగ్ సాగగా, పట్టభద్రులకు 59.03శాతం, ఉపాధ్యాయకు 83.54శాతం నమోదైంది. సాయంత్రం తర్వాత ఉమ్మడి జిల్లాల్లోని బ్యాలెట్ బాక్సులను కరీంనగర్ అంబేద్కర్ స్టేడియానికి తరలించి, ఇండోర్‌స్టేడియంలో భద్రపరిచారు. ఈ నెల 26న ఫలితాలను ప్రకటించనుండగా, ఇందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు.

కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జల్లాల పరిధిలో శుక్రవారం పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరిగింది. నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. సాయంత్రం 4 గంటల వరకు బారులు తీరి కనిపించారు. క్యూలో నిల్చొని ఉత్సాహంగా ఓటు వేశారు. కలెక్టర్లు, జేసీలతోపాటు పలువురు ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా పట్టభద్రుల నియోజకర్గంలో మొత్తం 1,95,581 మంది ఓటర్లకు 1,15,458 మంది (59.03శాతం), ఉపాధ్యాయ నియోజకవర్గంలో 23,160 మంది ఓటర్లకు 19,349 మంది (83.54 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రభుత్వం క్యాజువల్ సెలవులు మంజూరు చేయడంతో ఉపాధ్యాయులే ఎక్కువశాతం ఓటు వేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 83.48 శాతం మంది ఉపాధ్యాయులు, 58.69 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం తర్వాత ఉమ్మడి నాలుగు జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను కరీంనగర్ జిల్లాకేంద్రానికి తరలించారు. అంబేద్కర్ స్టేడియంలో ఇండోర్ స్టేడియంలో భద్రపరిచారు. ఈనెల 26న కౌటింగ్ చేసి, ఫలితాలను ప్రకటించనున్నారు.

69
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles