దేశానికే తెలంగాణ దిక్సూచి

Sat,March 23, 2019 01:29 AM

మెట్‌పల్లి, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ ఆలోచన విధానాలతో ముం దుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రం దే శానికే దిక్సూచిగా మారిందని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభిప్రాయపడ్డారు. శుక్రవా రం మెట్‌పల్లిలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రా ష్ట్రమనీ, గడిచిన నాలుగున్నరేండ్లలో వివిధ సంక్షేమ పథకాలు పద్ధతి ప్ర కారం అమలయ్యేలా ప్రభుత్వ పాలనను అందించిన సీఎం కేసీఆర్ నిర్వహణ తీరును గౌరవించి ప్రజలు టీఆర్‌ఎస్‌కు మళ్లీ అధికారం కట్టబెట్టారన్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రజ లు టీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారనీ, తప్పకుండా టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులను భారీ మె జార్టీతో గెలిపిస్తారని ఆశాభావంతో ఉన్నట్లు తెలిపారు. కేంద్రంలో మన సంఖ్యాబలం శాసించే విధంగా ఉం డడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్ట్‌లను సాధించుకునేందుకు అవకాశం ఎక్కువగా ఉం టుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నదనీ, ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధులు అవసరమనీ, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే రూ. లక్షల కోట్ల బడ్జెట్‌లో మనకు రావాల్సిన వాటాను సాధించాలంటే పా ర్లమెంట్‌లో మనకు సరైన బలం ఎంతో అవసరమని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని పలుమార్లు కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదనీ, హైకోర్టు విషయంలోనూ టీఆర్‌ఎస్ ఎంపీలు పోరాడితే తప్ప విభజన జరగలేదన్నా రు. కేంద్రంలో బలమైన శక్తిగా మనం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో, దేశంలోనే ఒక కొత్త విధానాన్ని తెచ్చి రై తాంగానికి అందించేలా సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారన్నారు.

నిజామాబాద్ ఎంపీ అభ్య ర్థి కల్వకుంట్ల కవితను ప్రజలందరూ బలపర్చి కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జగిత్యా ల, కోరుట్ల నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే రెట్టింపు మెజార్టీ వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందనీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అభివృద్ధిని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ నాయకులు ముం దుకు రాని పరిస్థితి ఏర్పడిందనీ, నిజామాబాద్ నుంచి పోటీ చేసేందుకు మధుయాష్కీ విముఖత చూపకపోయినా పార్టీ బలవంతంగా నిర్ణయిస్తే తప్ప ముందుకు రాలేదనీ, ఎంపీ కవితపై పోటీ చేసేందుకు జంకుతున్నారని ఎద్దే వా చేశారు. పదేళ్లు ఎంపీగా పని చేసిన ఆయ న చేసిన అభివృద్ధి శూన్యమనీ, ప్రజలకు జవాబుదారీగా ఎన్న డూ లేడని విమర్శించారు. ఎంపీ కవిత గడిచిన ఐదేండ్లలో మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి ప్రజా సం క్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడ్డారనీ, అలాంటి మంచి నాయకురాలిని ప్ర జలంతా ముక్తకంఠంతో బలపర్చాల్సిన అవసరం ఉం దన్నారు.

గత శాసన సభ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానా ల్లో పోటీ చేస్తే ఏ ఒక్క స్థానంలో డిపాజిట్ రాలేదనీ, ఈ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి అదే పునరావృతమవడం ఖాయమన్నారు. పసుపు బోర్డును ఏర్పాటు చేసి, గిట్టుబాటు ధరను కల్పించి పసుపు రైతులను ఆదుకోవాలని ఎంపీ కవిత చాలా ప్రయత్నం చేశారనీ, కేంద్ర ప్ర భుత్వం దృష్టికి అనేక మార్లు తీసుకెళ్లినా, అందుకు కేం ద్రం సహకరించలేదన్నారు. పదేండ్లు ఎంపీగా ఉన్న మధుయాష్కీ, మరి కొందరు నాయకులు పసుపు రై తులను ఏ మాత్రం పట్టించుకోకపోగా ఇప్పుడు నామినేషన్ల విషయంలో రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది టీఆర్‌ఎస్‌కు మాత్రమేననీ, పసుపు బోర్డు, గిట్టుబాటు ధర లాంటి డిమాండ్‌ను ముందుకు తెచ్చిం ది ఎంపీ కవిత అనే విషయం మర్చి పోవద్దన్నారు. రైతులు ఆలోచించాలని, ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవద్దనీ, రాబోయే రోజుల్లో తప్పకుండా పసుపు బోర్డు, గిట్టుబాటు ధరను తెచ్చేలా తమ ప్రభుత్వం కృషి చే స్తుందని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు తమ అధినేత అభ్యర్థులను ప్రకటించారనీ, ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా టీఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో 25 వేల మంది ముఖ్య కార్యకర్తలతో సన్నాహాక సమావేశాలు నిర్వహించి, ఎన్నికల సందర్భంగా అవలంబించాల్సిన వ్యూ హంపై, పార్టీ శ్రేణులను సన్నద్ధం చేశారన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు ఓరుగంటి రమణారావు ఉన్నారు.

మంత్రి కొప్పులకు స్వాగతం, సన్మానాలు
మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు శుక్రవారం పట్టణంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం ప లికారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు నివాసానికి వచ్చిన మంత్రిని టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు శాలువాలతో సన్మానించారు. ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ అమ్జాద్ మంత్రికి దట్టి కట్టా రు. ఆయా కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షు డు బర్ల సాయన్న, ఇబ్రహీంపట్నం మండల శాఖ అధ్యక్షుడు ఎలాల దశరథరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ రాంరెడ్డి, మాజీ ఎంపీపీ ఏనుగు భూలక్ష్మి బుచ్చిరెడ్డి దంపతులు, నాయకులు మారు సా యిరెడ్డి, దారిశెట్టి రాజేశ్, కట్కం నర్సారెడ్డి, ఒజ్జెల శ్రీనివాస్, భూరం మహేందర్, పిప్పెర శేఖర్, ఏశవేణి గణే శ్, ద్యావతి నారాయణ, సారథిగౌడ్ పాల్గొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles