కమనీయం.. వెంకన్న కల్యాణం


Sat,March 23, 2019 01:29 AM

కోరుట్ల : పట్టణం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణం శుక్రవారం వై భవంగా నిర్వహించా రు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణాన్ని జరిపారు. ఆలయంలో ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు తదితర కార్యక్రమాలను నిర్వహించగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సతీమణి సరోజన కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి పల్లకి సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాస్, నర్సయ్య, ఆలయా భివృద్ది కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

50

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles