పంట నష్టంపై సర్వే చేయాలి..

Fri,March 22, 2019 01:06 AM

గొల్లపల్లి: మండలంలో వడగండ్ల వానకు దెబ్బతి న్న పంట నష్ట వివరాలు త్వరగా సర్వే చేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. మండలం లో దెబ్బ తిన్న పంటలను ఆయన పరిశీలించారు. బుధవారం కురిసిన అకాల వర్షానికి ఈదురు గాలుల బీభత్సానికి, వడగండ్లుకు మండలంలోని శ్రీరాములపల్లి, బీబీరాజ్‌పల్లి, శంకర్రవుపేట, వెంగళాపూర్, నందిపల్లి, మల్లన్నపేట గ్రామాల్లో మామి డి, వరిపొలం, అరటి, పొప్పాయ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వ్యవసాయ, ఉద్యా న వనాధికారుల ప్రాథమిక అంచాల ప్రకారం.. మండలంలో మామిడి 636 హెక్టార్లు, అరటి, పొప్పడి ఒక హెక్టారు చొప్పున నష్టపోయినట్లు పేర్కొన్నారు. మండలంలో 1330 ఎకరాల్లో వరి, 23 ఎకరాల్లో మొక్కజొన్న, 191 ఎకరాల్లో నువ్వు పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు పేర్కొన్నారు. మండలంలో 21 ఇండ్లు కూలిపోయినట్లు తహసీల్దార్ లకా్ష్మరెడ్డి తెలిపారు. కలెక్టర్‌తో పాటు, ఆర్డీ వో నరేందర్, జిల్లా ఉద్యాన వనాధికారి ప్రతాప్‌సింగ్, తహసీల్దార్ లకా్ష్మరెడ్డి, ఏవో కరుణ, సర్పంచి గంగా రెడ్డి ఉన్నారు.

పంట నష్టం వివరాలను మంత్రి దృష్టికి
గొల్లపల్లి మండలంలో అకాల వర్షం, వడగండ్లుకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు పంటల నష్టం వివరాలను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని గొల్లపల్లి మండల టీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం అయిన వారు మాట్లాడుతూ పంట నష్టం వివరాలను అధికారులు అందించగానే పంటలు నష్ట పోయిన రైతులను ఆదుకునేందుకు మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో టీఆర్‌ఎస్ నాయకులు హన్మాండ్లు, జలందర్, నల్లగొండమ్ గౌడ్, కే లింగా రెడ్డి, కిష్టా రెడ్డి, నా రాయణ రెడ్డి, కే. లింగా రెడ్డి, నగేశ్, గంగా రెడ్డి, రమేష్, మల్లేశం, మల్లా రెడ్డి, జలేందర్, బుచ్చి రెడ్డి, వెకటేశ్, వీరస్వామి ఉన్నారు.

కొడిమ్యాలలో కలెక్టర్ పరిశీలన..
కొడిమ్యాల: మండలంలోని నల్లగొండ, తిప్పాయపల్లి గ్రామాల్లోని వరి పంటను గురువారం కలెక్టర్ శరత్ పరిశీలించారు. బుధవారం కురిసిన వడగండ్ల వర్షానికి వరి పంట పూర్తిగా దెబ్బతినగా కలెక్టర్‌తో పాటు ఆర్డీవో నరేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతి రైతు నుంచి వివరాలు సేకరించి పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. నష్టపోయిన ప్ర తి రైతుకు పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారి అమీనాబేగం,తహసీల్దార్ పద్మావతి, వ్యవసాయాధికారి జ్వోతి, సర్పంచ్ పల్లి మల్లేశం, లత, తదితరులున్నారు.

వ్యవసాయాధికారుల పరిశీలన..
మండలంలోని నల్లగొండ, తిప్పాయపల్లి గ్రామాలలో బుధవారం సాయంత్రం వడగండ్ల వర్షం పడటంతో దెబ్బతిన్న వరి పంటలను గురువారం జిల్లా వ్యవసాయాధికారి అమీనాబేగం, ఏఓ పర్లపెల్లి జ్వోతి పరిశీలించారు. నల్లగొండ, తిప్పాయపల్లి గ్రామాల్లో ఎక్కువ శాతం వరి పంటకు నష్టం వాటిల్లినట్లు అమె తెలిపారు. 450 హెక్టార్లలో (1130 ఎకరాలు) వరి పంటకు నష్టం వాటిల్లినట్లు ఏఓ జ్వోతి తెలిపారు. నేటి నుంచి రెండు రోజుల పాటు గ్రామంలో అధికారులతో సర్వే నిర్వహించి పూర్తి స్థాయి అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి విన్నవించనునట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రీనివాస్, సర్పంచ్‌లు పల్లి మల్లేశం,మ్యాకల లత, మల్లేశం, ఉన్నారు.

సారంగాపూర్ : సారంగాపూర్, బీర్‌పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం రాత్రి ఈదురుగాలులతో కొద్దిసేపు భారీ వర్షం కురిసింది.బీర్‌పూర్ మండలంలోని కొల్వాయిలో వరి పంటలు, బీర్‌పూర్‌లో మొక్కజొన్న పంటలు ఈ దురుగాలులకు నెలవాలాయి. గరువారం వ్యవసాయ అధికారులు పరిశీలించీ, పంట నష్ట వివరాలు తెలుసుకున్నారు.

69
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles