గొల్లపల్లి: మండలంలోని చెందోలి గ్రామం సమీపంలో కల్వర్డుకు ఉన్న సిమెంట్ పిల్లరుకు బైక్ ఢీ కొన్న ఘటనలో ధర్మారం మండలం సాయంపేటకు చెందిన ద య్యాలు గంగయ్య (45) అక్కడికి అక్కడే మృతి చెందాడు. సాయంపేటకు చెందిన గంగయ్య, తన స్నేహితుడు కొర్రె రాజయ్యను వెంట పెట్టుకుని గొల్లపల్లి మండ లంలోని చెందోలిలోని వారి బంధువుల ఇంటికి హోలీ సంబురాల సందర్భంగా రావ డం జరిగింది. వారి ఇంటికి తిరిగి వె ళ్తుండగా, గ్రామం శివారులోని కల్వర్టు వద్ద రక్షణగా సిమెంట్ పిల్లరుకు బైక్ ఢీ కొనడంతో గంగయ్య మృతి చెందాడు. రాజయ్యకు గాయాలయ్యాయి. జగిత్యాలకు తరలించి వైద్యం చేయిస్తున్నా రు. బాధితుడి భార్య చంద్రమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కిరణ్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వెల్గటూర్‌లో యువకుడు..
వెల్గటూరు : ఆన్లైన్ వస్తున్న పబ్జీ గేమ్ కు అలవాటుపడి మెడ నరాలు పట్టుకొని, అందులో పక్షవాతం రాగా , హైదరాబాద్‌లో గల ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ మండలంలోని రాజారాంపల్లికి చెందిన బండ సాగర్(20) గురువారం మృతి చెందా డు. మృతుడి మిత్రులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్గటూరు మండలంలోని రాజారాంపల్లి గ్రామానికి చెందిన బండ సాగర్ కొద్ది నెలలుగా పబ్జీ గేమ్‌కు అలవాటు పడిపోయాడు. ఈ క్రమంలో జనవరిలో గేమ్ అనుతున్న సమయంలో అతని మెడ నరాలు పట్టుకోడంతో పాటుగా, పక్షవాతం వచ్చింది. దీంతో అతడి తల్లిదండ్రులు చికిత్సకోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకి తీసుకెళ్లారు. కాగా, చికిత్స పొందుతూ అతడు గురువారం మృతి చెందినట్లు తెలిపారు.