ముగిసిన త్రిరాత్రోత్సవాలు

Fri,March 22, 2019 01:01 AM

వేములవాడ కల్చరల్ : ఫాల్గుణ శుద్ధ త్రయోదశి మంగళవారం నుంచి పౌర్ణమి వరకు రాజన్న ఆలయంలో నిర్వహించిన త్రిరాత్రోత్సవాలు గురువారంతో ముగిసాయి. ఇందులో భాగంగా రాజన్న ఆలయంలో రాత్రి 8గంటలకు ఆలయ అర్చకులు శాస్ర్తోక్తంగా వేదమంత్రాల మధ్య డోలోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వేములవాడ రాజన్న ఆలయ అద్దాల మండపంలో వివిధరకాల పుష్పాలతో అందంగా తయారుచేసిన డోలాలో ఉత్సవమూర్తులకు వేదపండితులైన బ్రాహ్మణులు విశేషపూజలు చేశారు. పవళింపుసేవతో డోలోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో ప్రధానార్చకులు ఈశ్వరగారి సురేశ్, అర్చకులు గంటన్నరపాటు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో దూస రాజేశ్వర్ దంపతులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles