కమనీయం తెప్పోత్సవం

Fri,March 22, 2019 01:01 AM

ధర్మపురి, నమస్తే తెలంగాణ : ధర్మపురి నృసంహుడి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భా గంగా గురువారం సాయంత్రం బ్రహ్మపుష్కరణిలో ఉగ్ర నారసింహుడి తెప్పోత్సవం కనులపండువలా సాగింది. ఆస్థాన వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు ఉభయ దేవేరులతో స్వామి వారిని సేవలపై ప్రతిష్టించి, శోభాయాత్రగా తీసుకువచ్చారు. అనంతరం హంసవాహనంపై అలంకరించి, పుష్కరిణిలో ఐదుసార్లు ప్రదక్షిణలు చేశారు. భక్తులు నమో నారసింహ జయజయధ్వానాలు చేశారు. పలువురు మహిళలు పురష్కరణి మెట్లపై కోలాటం ఆడగా.. అందరినీ ఆకట్టుకుంది. అనంతరం పుష్కరణి మధ్యలోని మండపంలోని ఊయలలో స్వామి వారలను ప్రతిష్టించి డోలోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరి, మొక్కులు చెల్లించుకున్నారు. సీఐ లక్ష్మీబా బు, ఎస్‌ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, డీసీఈఓ అమరేందర్, ధర్మకర్తలు ఇనుగంటి వేంకటేశ్వర్‌రావ్, అక్కనప ల్లి సునీల్‌కుమార్, సాయిని శ్రీనివాస్, ము రికి భాగ్యలక్ష్మి, మధు నటరాజ్‌శర్మ, జెట్టి రాజన్న, మామిడి లింగన్న, దొమకొండ తి రుపతి, జోగినపల్లి రమాదేవి పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles