ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్

Fri,March 22, 2019 01:01 AM

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ);ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన సం బంధిత ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, విద్యాలయాలకు శుక్రవారం సెలవు వర్తిస్తుందని ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఓటు అర్హత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని చెప్పారు. ఎన్నికల్లో ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఆయా ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు అనుమతించాలని సూచించారు.

గుర్తింపు కార్డులు చూపాలి
ఓటేసేందుకుగాను ఎపిక్ కార్డు (ఓటరు గుర్తింపుకార్డు) లేని పట్టభద్రులు, టీచర్లు ఇతర గుర్తింపు కార్డులు చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల అధికారి సూచించారు. పోలింగ్‌కు 9 రకాల గుర్తింపు కార్డులను ఎన్నికల అధికారులు అనుమతిస్తారని చెప్పారు. పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, సర్వీస్ ఐడెండిటీ కార్డు (ప్రభుత్వ సంస్థల అధికారులు జారీ చేసిన కార్డు), యూనివర్సిటీ జారీ చేసిన ఒరిజినల్ డిగ్రీ, డిప్లొమా సర్టిఫికెట్, దివ్యాంగులైతే ఒరిజినల్ సర్టిఫికెట్, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్, లోకల్ బాడీస్, ప్రైవేట్ సంస్థల ఉ ద్యోగులైతే సంబంధిత అధికారులు జారీ చేసిన గుర్తింపు కార్డులు, ఆధార్‌కార్డు, ఎంపీ, ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీలు జారీ చేసిన కార్డులున్న వారు ఓటేయవచ్చునని చెప్పారు.

36
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles