కమణీయం.. వేంకటేశ్వర కల్యాణం

Fri,March 22, 2019 01:01 AM

ఇబ్రహీంపట్నం: మండలంలోని వేములకుర్తి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీలక్ష్మీ వేంకటేశ్వర - అలివేలు మంగమ్మ కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చక్రపాణి నర్సింహమూర్తి చార్యులు వైదిక నిర్వహణలో స్వామి వారి కల్యాణాన్ని వేద మంత్రోచ్ఛరణల మధ్య వైభవంగా జరిపించారు. అనంతరం హాజరైన భక్తులు ఆలయం లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వేడుకలకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సతీమణి సరోజ హాజరయ్యారు. ఆలయ కమిటీ తరుపున భక్తులకు అన్నదా నం చేశారు. ఇక్కడ సర్పంచ్ సున్నం నవ్యశ్రీసత్యం, ఎంపిటీ సీ సభ్యురాలు పెంట లక్ష్మీలింబాద్రి, అలయ కమిటీ అధ్యక్షు డు అంకతి రాజన్న, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు లోక శ్రీనివాస్, ఆరె రాజ్‌కుమార్, వీడీసీ సభ్యులు ఉన్నారు.

28
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles