హోలీ పండగ ఐక్యతకు చిహ్నం

Fri,March 22, 2019 01:01 AM

జగిత్యాల అర్బన్: హోలీ పండుగ ఐక్యతకు చిహ్నమని, కులమతాలకు అతీతంగా సామరస్య వాతావరణలో జరుపుకునే సంబురాల్లో ఒకటని కలెక్టర్ శరత్ పేర్కొన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హోలీ తెలంగాణ సంస్కృతికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు సమర్థవంతంగా ప్రజలకు అందిస్తున్న అధికారులను, ఉద్యోగులను అభినందిస్తూ ప్రజలకు అత్యుత్తమ సేవలందించడమే లక్ష్యం గా పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన సూ చించారు. హోలీ వేడుకల్లో చల్లుకునే అందమైన రంగుల్లాగే జగిత్యాల జిల్లా ప్రజల జీవితాల్లో ఆనందం వెల్లవిరయాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

కాగా కలెక్టర్ శరత్‌కు ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ ఉద్యోగ ఐకాస గౌరవాధ్యక్షుడు హరి అశోక్ కుమార్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు బోగ శశిధర్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండి వకీల్, టీఎన్జీవోల కార్యదర్శి ఆకుల సత్యం, రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యదర్శి చెలుకల కృష్ణ, టింగో జిల్లా అధ్యక్షుడు విజయేందర్, ఉద్యోగ సంఘాల నాయకులు నాగేందర్ రెడ్డి, ఎలిగేటి రవీందర్, ఎండీ ఖాదర్, పెన్షనర్ల నేతలు విశ్వనాథం, విజయ్, విఠల్ రావు, తిరుమల్ రావు, శ్రీనివాస్ యాదవ్, రాజేందర్ రావు, శ్యాం, వివిధ మండలాల అధికారులు తదితరులున్నారు.

సంబురాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన హోలీ వేడుకల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొని ప్రజలకు, ఉద్యోగులకు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు ఉద్యోగ సంఘా లు, కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బాలె శేఖర్, టీవీ సూర్యం, దివాకర్ రావు, బెజ్జంకి లక్ష్మణా చారి, సీగిరి ప్రభాకర్, ముస్కు ఎల్లారెడ్డి, రెవెన్యూ ఉద్యోగ సంఘా ల నాయకులు బోగ శశిధర్, ఎండీ వకీల్, గౌరవాధ్యక్షుడు హరి అశోక్ కుమార్, టీఎన్జీవోల నాయకులు ఆకుల సత్యం, విజయేందర్, తదితరులున్నారు.

57
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles