నమో నారసింహా!

Fri,March 22, 2019 01:00 AM

ధర్మపురి, నమస్తే తెలంగాణ : ధర్మపురి పట్టణం నారసింహుడి నామస్మరణతో మార్మోగుతున్నది. ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు కొనసాగుతున్నండగా.. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సం ఖ్యలో తరలివస్తున్న భక్తులతో ఆలయం, గౌతమీ తీరం కిటకిటలాడుతున్నాయి. గురువారం వేకువ జాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గోదావరిలో స్నానాలు చేసి, మొక్కులు చెల్లించా రు. మహిళల పూనకాలు, పూజా కార్యక్రమాలతో గోదావరి తీరం సందడిగా కనిపించింది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసిన అనంతరం భక్తులు శివుని త్రిశూలం, వీరగోల చేతపట్టుకొని ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. యోగ, ఉగ్ర నారసిం హ స్వామి వారలతో పాటు వేంకటేశ్వరస్వామి, రామలింగేశ్వరస్వామి వారలను దర్శించుకున్నా రు. ఆలయం తరఫున పాత టీటీడీ కల్యాణ మం డపంలో సుమారు 6వేల మందికి అన్నదానం చేశారు. అన్నదానం సమయంలో దేవస్థానం చైర్మ న్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, డీసీ, ఈఓ అమరేందర్ ఆధ్వర్యంలో ధర్మకర్తలు అక్కనపల్లి సునీల్‌కుమా ర్, ఇనుగంటి వేంకటేశ్వర్‌రావు, మురికి భాగ్యల క్ష్మి, జెట్టి రాజన్న, మామిడి లింగన్న, దోమకొండ తిరుపతి, జోగినపల్లి రమాదేవి, ఆర్యవైశ్య నేతలు మురికి శ్రీనివాస్, రంగ శంకరయ్యతో పాటు పలువురు విద్యార్థులు భక్తులకు సేవలందించారు.
వైభవంగా నిత్యహోమం
ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకల సందర్భం గా నిత్యహోమాలు వైభవంగా జరిపారు. యాజ్ఞికులు కందాళై పురుషోత్తమాచార్య తదితర వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య నిత్యపూజలు, అభిషేక కార్యక్రమాలు ఘనంగా సాగాయి.
బ్రహ్మోత్సవాల్లో నేడు..
ధర్మపురి లక్ష్మీనృసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శుక్రవారం మ ధ్యాహ్నం మూడు గంటలకు బ్రహ్మపుష్కరిణి (కోనేరు)లో వేంకటేశ్వరస్వామివారి తెప్పోత్సవం, డోలోత్సవం, సాయంత్రం వేళలో నృసింహస్వా మి దక్షిణ దిగ్యాత్ర కార్యక్రమాలుంటాయని డీసీ, ఈఓ తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భా గంగా సాయంత్రం 7గంటల నుంచి రాత్రి వరకు వివిధ కార్యక్రమాలుంటాయని దేవస్థానం చైర్మన్, డిప్యూటీ కలెక్టర్, కార్యనిర్వహణాధికారి అమరేందర్ తెలిపారు.

71
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles