దేశానికి తెలంగాణ రోల్‌మోడల్

Thu,March 21, 2019 01:02 AM

- రాష్ట్ర సమగ్రాభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం
- 16 లోక్‌సభ స్థానాలు గెలిస్తే ఢిల్లీని శాసించవచ్చు
- నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత
- మెట్‌పల్లిలో బూత్ కమిటీ, గ్రామశాఖ కన్వీనర్లతో సమావేశం

మెట్‌పల్లి,నమస్తేతెలంగాణ: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక రోల్ మోడల్‌గా మారిందనీ, సీఎం కేసీఆర్ వి జన్ ఇప్పుడు దేశానికి దిక్సూచి అని నిజామాబా ద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పట్టణంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో బుధవారం సా యంత్రం ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్‌ప ల్లి, కోరుట్ల మండలాల బూత్ కమిటీ కన్వీనర్లు, గ్రామ శాఖల ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎంపీ ముఖ్య అథితి హాజరై మాట్లాడారు. 16 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్ గెల్చుకుంటే ఢిల్లీని శాసించవచ్చని పేర్కొన్నారు. రా ష్ర్టాలు బాగుంటేనే కేంద్రం బాగుంటుందని, దీన్ని మర్చిన బీజేపీ ప్ర భుత్వం రాష్ర్టాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసిందనీ, ఆఖరికి గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేపట్టాలన్న నిధుల కోసం కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితికి నెట్టివేసిందని విమర్శించారు. తెలంగాణ సమగ్రాభివృద్ధియే లక్ష్యంగా సీ ఎం కేసీఆర్ ఒక విజన్‌తో అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. బూత్ కమిటీలు పార్టీకి పట్టుకొమ్మలు అని అన్నారు. ప్రజలకు మేలు చేసే వి ధం గా మన ఆలోచన విధానం ఉండాలనీ, ప్రతి ఒ క్కరూ పని చేసే దృక్ఫథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. గ్రామ శాఖలు, బూత్ కమిటీలు సమన్వయంతో పని చేయాలని కోరారు. గ్రామ అవసరాలను తీర్చాల్సిన బాధ్యత గ్రామ స్థాయి నాయకులపై ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతు న్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. దేశంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్న పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమేనని, ఇది కార్యకర్తలుగా మన అందరికీ గర్వకారణం అని పేర్కొన్నారు.

కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, అధికారంలోకి రాగానే వెంటనే ఆ హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తైతే సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని, లక్షలాది ఎకరాల భూములు సస్యశ్యామలమవుతాయన్నారు. మ నం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను చెప్పుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందనీ, పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా పో లింగ్ జరగాలని, శాసన సభ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ ఈ నియోజకవర్గం నుంచి సాధిస్తామని సమావేశంలో పాల్గొన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, బూత్ కమిటీ కన్వీనర్లు, గ్రామ శాఖల అధ్యక్ష, కార్యదర్శులు ధీమా వ్యక్తం చేశా రు. అంతకు ముందు నిజామాబాద్‌లో జరిగిన సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కృషి చేసిన వారందరికి ఎంపీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా మండలాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించారు. శాసన స భ ఎన్నికల ఫలితాల ఆధారంగా గ్రామ నాయకు ల పనితీరును విశ్లేషించారు. ఆయా మండలాల్లో ని గ్రామాలు, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో అవసరాలు, పరిష్కారం తదితర అంశాలపై చర్చించా రు. ఇటీవల నూతనంగా ఎ న్నికైన గ్రామ పంచాయతీ సర్పంచులకు ఎంపీ క విత అభినందనలు తెలిపారు. ఇక్కడ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ చీటి వెంకట్రావు, నాయకులు సింగిరెడ్డి నారాయణరెడ్డి, డా.అనూప్‌రావు, దారిశెట్టి రా జేశ్, జడ్పీటీసీలు, ఎంపీపీ లు, సింగిల్ విండో చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ మండల, పట్టణాధ్యక్షులు, తదితరులు న్నారు.

60
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles