ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి

Thu,March 21, 2019 01:01 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి తనను ఆశీర్వదించి గెలిపిస్తే ని యోజకవర్గాన్ని అన్నిరంగాల్లో మరింత అభివృద్ధి చేస్తానని టీఆర్‌ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, పార్లమెంట్ సభ్యుడు వినోద్‌కుమార్ పేర్కొన్నారు. క రీంనగర్‌లో బుధవారం ఉదయం స్థానిక మహిళా డిగ్రీ కళాశాల, ఆర్ట్స్ కళాశాల మైదానంలో వాకర్స్‌ను కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కరీంనగర్‌ను ఇప్పటికే స్మార్ట్‌సిటీగా ఎంపిక చేయించామని, ఈ పథకం కింద రూ.250 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు టెండర్ల పక్రియ పూర్తయిందని గుర్తుచేశారు. కరీంనగర్ త్వరలోనే రైల్వే జంక్షన్‌గా మారుతుందన్నా రు. ఇప్పటికే మనోహరాబాద్, కొత్తపల్లి రైల్వే ప నులు వేగంగా సాగుతున్నాయన్నారు. గజ్వేల్ వ రకు ఇప్పటికే రైల్వే ట్రాక్ పూర్తి అయ్యిందని, సిద్దిపేట, సిరిసిల్ల వరకు భూసేకరణ కూడ పూర్తయిందని చెప్పారు. గతంలో పెద్దపల్లి, నిజామాబాద్ రైల్వే లైన్ పనుల పూర్తికి 20 ఏండ్లకు పైగా పట్ట గా.. మనోహరాబాద్ రైల్‌ను కేవలం రెండు, మూ డేండ్లలోనే పూర్తి చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు రూ.750 కోట్ల నిధులు మంజూరు అయ్యాయన్నారు.

అలాగే తీగలగుట్టపల్లి వద్ద ఇప్పటికే ఆర్‌ఓబీ మంజూరు అయిందని, దీనికి నిధులు కూడ వచ్చాయన్నారు. ముంబై రైల్‌ను ప్రారంభించగా, ఇది జిల్లా వాసులకు ఎంతో ఉపయోగపడుతున్నదని చెప్పారు. గతంలో కరీంనగర్‌కు ఒక్క జాతీయ రహదారి కూడ లేదని, గత ఐదేండ్ల కా లంలో కరీంనగర్‌కు నాలుగైదు జాతీయ రహదారులను మంజూరు చేయించామని గుర్తుచేశారు. అలాగే నగరంలోనే జాతీయ రహదారుల సూపరింటెండెంట్ కార్యాలయాన్ని కూడ ఏర్పాట్లు చే యించామని తెలిపారు. ఈ ఐదేండ్ల కాలంలో రా ష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలందరం ఎంతో కృ షి చేశామన్నారు. పార్లమెంట్‌లో అనేక చర్చ ల్లో తాను పాల్గొన్నానని గుర్తు చేశారు. తనను మరోసారి ఎంపీగా గెలిపిస్తే రాష్ట్ర, నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానన్నారు. ఇక్కడ జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, ఎ మ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, నగర మేయర్ రవీందర్‌సింగ్, జడ్పీటీసీ శరత్‌రావు, కార్పొరేటర్లు వై సునీల్‌రా వు, తాటి ప్రభావతి, నాయకులు కోడూరి స త్యనారాయణగౌడ్, ఆకారపు భాస్కర్‌రెడ్డి, మునీందర్, చీటీ రామారావు, శ్రీనివాస్, గుర్రం పద్మ తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles