మిషన్ భగీరథ పనులపై కలెక్టర్ సమీక్ష

Thu,March 21, 2019 01:01 AM

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ:జగిత్యాల జిల్లాలోని మిషన్ భగీరథ పనులపై మండలాల వారీగా బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ శరత్ సమీక్ష నిర్వహించారు. బుగ్గారంలో తొమ్మిది హ్యాబిటేషన్లకుగానూ ఎనిమిది పూర్తి కాగా ఒక్కటి పెండింగ్‌లో ఉందనీ, ధర్మపురిలో 37కు గానూ 23పూర్తి కాగా 14పెండింగ్‌లో ఉన్నాయని, గొల్లపల్లిలో 31కి గానూ 24పూర్తి కాగా ఏడు పెండింగ్‌లో ఉన్నాయని, పెగడపల్లిలో 38కి గానూ 19పూర్తి కాగా 19పెండింగ్‌లో ఉన్నాయనీ, వెల్గటూరులో 40కి గానూ 21 పూర్తి కాగా 19 పెండింగ్‌లో ఉన్నాయనీ, బీర్‌పూర్‌లో 18పూర్తయ్యాయనీ, జగిత్యాలలో 41కి గానూ 34పూర్తి కాగా ఏడు పెండింగ్‌లో ఉన్నాయనీ, రాయికల్‌లో 49కి గానూ 21పూర్తి కాగా 28పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సారంగాపూర్‌లో 19కి గానూ 10 పూర్తి కాగా తొమ్మిది పెండింగ్‌లో ఉన్నాయని, కొడిమ్యాలలో 31కి గానూ 21పూర్తి కాగా 10పెండింగ్‌లో ఉన్నాయనీ, మల్యాలలో 29కి గానూ 20 పూర్తి కాగా తొమ్మిది పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇబ్రహీంపట్నంలో 24కి గానూ 15 పూర్తి, తొమ్మిది పెండింగ్, కోరుట్లలో 19కి గానూ 14 పూర్తి, ఐదు పెండింగ్, మల్లాపూర్‌లో 29కి గానూ 20 పూర్తి కాగా తొమ్మిది పెండింగ్‌లో ఉ న్నాయని, మెట్‌పెల్లిలో 27కి గానూ 18పూర్తి కాగా తొమ్మిది పెండింగ్, కథలాపూర్‌లో 18కి గానూ 11పూర్తి కాగా ఏడు పెండింగ్‌లో ఉన్నాయని, మేడిపల్లిలో 26కి గానూ 10 పూర్తికాగా 16 పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.

అలాగే ట్యాంకుల రిపేరు, కలరింగులో బుగ్గారంలో 10కి గానూ ఎనిమిది పూర్తి కాగా రెండు పెండింగ్, ధర్మపురిలో 37కి 28పూర్తి 9 పెండింగ్, గొల్లపల్లిలో 13కి 9 పూర్తి 4పెండింగ్, పెగడపల్లిలో 25కు 13 పూర్తి 12 పెండింగ్, వెల్గటూర్‌లో 28కి 10 పూర్తి, 18 పెండింగ్, బీర్‌పూర్‌లో 11పూర్తయ్యాయని తె లిపారు. జగిత్యాలలో 43కు 30పూర్తి, 13పెండిం గ్, రాయికల్‌లో 48కు 35పూర్తి, 13పెండింగ్, సారంగాపూర్‌లో 14కు 12పూర్తి, 2పెండింగ్, కొ డిమ్యాలలో 43కు 30పూర్తి, 13పెండింగ్, మల్యాలలో 37కు 24పూర్తి 13పెండింగ్, ఇబ్రహీంపట్నంలో 40కి 20పూర్తి 20పెండింగ్, కోరుట్లలో 29కి 18పూర్తి 11పెండింగ్, మల్లాపూర్‌లో 35కు 20పూర్తి 15పెండింగ్, మెట్‌పల్లిలో 30కి 4పూర్తి 26పెండింగ్, కథలాపూర్‌లో 35కి 17పూర్తి 18 పెండింగ్, మేడిపల్లిలో 39కి 29పూర్తి 10పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పనులను మార్చి 31నాటికి పూర్తయ్యేలా చూడాలన్నా రు. తవ్విన దగ్గర గుంతలు లేకుండా పూడ్చి రోడ్డు వేయాలని అధికారులకు సూచించారు. వివిధ దశల్లో పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు దగ్గరుండి పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ మిషన్ భగీరథ ఈఈ ఎ శ్రీనివాస్, డీపీవో ఎలతా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి
ఎండలు తీవ్రంగా ఉన్నందున వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ శరత్ సూచించారు. వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వ పోస్టర్‌ను బుధవారం కలెక్టరేట్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 22నుంచి 28వ తేదీ వరకు సూర్యుడి వేడి ఎక్కువగా ఉం టుందని తెలిపారు. గొడుగు, టోపి, రుమాలు లే కుండా బయటకు వెళ్లకూడదనీ, బయటకి వెళ్లినప్పుడు తరచుగా నీళ్లు తాగాలని సూచించారు. ఇక్కడ జేసీ బేతి రాజేశం, సీపీవో మల్లిఖార్జున్, హౌజింగ్ ఏఈ రాజేశం తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles