వెంగళాపూర్‌లో మద్యం అమ్మకాలు నిషేధం

Thu,March 21, 2019 01:00 AM

గొల్లపల్లి : మండలంలోని వెంగళాపూర్‌లో మద్యం అమ్మకాలు చేయరాదని బుధవారం సమావేశమైన గ్రామస్తులు తీర్మానించారు. గ్రామంలో నలుగురు మద్యం బెల్టుషాప్‌లు నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామంలో రాత్రి పగలు తేడా లేకుండా మద్యం విచ్చల విడిగా దొరుకుతుంది. మద్యానికి బానిసలైన కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో వీధిన పాలవుతున్నారు. గ్రామంలో మద్యం అమ్మకాలను నిషేధిస్తే కొన్ని కుటుంబాలు బాగుపడుతాయని నిర్ణయించుకున్న గ్రామస్తులు ఈనెల 8న గ్రామంలో బెల్టు షాఫ్‌ల ద్వారా మద్యం అమ్ముతున్న వారిని పిలిపించి వారితో మాట్లాడారు. ఈనెల 20లోగా మద్యం అమ్ముకోవాలని 20 నుంచి గ్రామంలో ఎవ్వరైనా మద్యం అమ్మినట్లు తెలిస్తే వారికి రూ.50 వేల జరిమానా విధిస్తామని చెప్పారు. ఈ తీర్మానంపై గ్రామంలో మద్యం అమ్మకాలు చేస్తున్న వారితో పోటు గ్రామ పెద్దలు సంతకాలు చేశారు. ఈ సమావేశంలో గుండ గంగయ్య, వై.మల్లారెడ్డి, కే మల్లారెడ్డి, గంగారెడ్డి, గుర్ర లచ్చయ్య, రాజయ్య, గంగయ్య, రంగు శ్రీనివాస్, గాదం కృపాకర్, రంగు కిష్టయ్య, రఘుపతి రెడ్డి, లకా్ష్మరెడ్డి, మేడిపల్లి రాంరెడ్డి, కట్కూరి మల్లేశ్, రాసమల్ల సురేశ్, తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles