హామీలన్నీ నెరవేరుస్తున్నాం

Wed,March 20, 2019 12:43 AM

-ఇందూరు-పెద్దపల్లి రైల్వే లైన్ పూర్తిచేయించాం
-కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశాం
-బీడీ కార్మికులకు పీఎఫ్ కటాఫ్ ఎత్తివేసి జీవన భృతి కల్పిస్తున్నాం
- రైతులకు ఏమీ చేయని కాంగ్రెస్, బీజేపీనామినేషన్ల పేరిట రాజకీయం చేస్తున్నయ్
-నిజామాబాద్ బహిరంగ సభలో ఎంపీ కల్వకుంట్ల కవిత
నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఇచ్చిన అన్ని హామీలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తున్నదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.నిజామాబాద్‌లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో మంగళవారం రాత్రి నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఆకలితో అలమటించే పేద, నిరుపేద వర్గాలకు అమలు చేస్తున్న రూ. వెయ్యి పింఛన్‌ను రూ. 2వేలకు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హామీ ఇచ్చిందన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి రూ. 2వేల పింఛన్ హామీ అమలవుతుందన్నారు. బీడీ కార్మికులు, టేకేదారులకు టీఆర్‌ఎస్ అండగా నిలిచిందన్నారు.బీడీ కార్మికులందరూ టీఆర్‌ఎస్‌కే ఓటు వేసి గెలిపించాలన్నా రు. 67 నుంచి 57 ఏళ్లకు పింఛన్ అర్హత వ యసును తగ్గించామని, తద్వారా అర్హులైన వారందరికీ పింఛన్ ఇవ్వబోతున్నామన్నారు. పీఎఫ్ కటా ఫ్ డేట్‌ను 2014 వరకు ఉన్న నిబంధనను ఎత్తివేసి మరెందరో బీడీ కార్మికులకు జీవనభృతి అం దిస్తున్నామన్నారు. నిరుద్యోగ సమస్య దేశమంతా ఉన్నదని, పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా కొం త మేర నిరుద్యోగ సమస్యలను తగ్గించినట్లు తెలిపారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్త్తామని చెప్పిన మా ట ప్రకారం కృషి జరుగుతోందన్నారు. ఇప్పటికే 40 వేల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరిగిందన్నా రు. రూ. 3వేల నిరుద్యోగ భృతి త్వరలో అమలు జరుగుతుందన్నారు. సొంత ఇల్లు ఉండాలనేది పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇం టి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయ కార్యక్రమం త్వరలోనే అమలవుతుందని చెప్పారు.

నెల రోజుల్లోపే డివిజన్ ఏర్పాటు చేశాం..
కోరుట్లను రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం నెల రోజుల్లోపే ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌దేనని ఎంపీ కవిత అన్నారు. జగిత్యాలలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు, జక్రాన్‌పల్లి వద్ద ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని హామీ ఇచ్చారు. టేకేదారులకు కూడా పింఛన్ ఇవ్వడంతో వారు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. పార్లమెంటులో టీఆర్‌ఎస్ గెలుపు కోసం ప్రచారం చేస్తామని టేకేదారులు తనతో తెలపడం సంతోషంగా ఉందన్నారు. 70 ఏళ్లలో ఎన్నో పార్టీలను చూశామన్నారు. కానీ, చెప్పిన మాట పై నిలబడే కొత్త ఒరవడిని కేసీఆర్ సృష్టించారని అన్నారు.

ఇచ్చిన మాట ప్రకారం రైల్వేలైన్ పూర్తి
గత పార్లమెంటు ఎన్నికల సమయానికి పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్ నిద్రపోతూ ఉం దని ఎంపీ కవిత గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం నిద్రపోతున్న పెద్దపల్లి రైలును కూతపెట్టి నిజామాబాద్‌కు పరుగులు పెట్టించామన్నారు. 2014 ఎ న్నికల సమయంలో రైతన్నలకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేశామని చెప్పారు.
సాగునీటి రంగానికి పెద్దపీట వేశాం..
ఎస్సారెస్పీ పునర్జీవ పథకం, కాళేశ్వరం 21- ప్యాకేజీ ద్వారా, నిజాంసాగర్ కాలువల ఆధునీకరణల ద్వారా, లిప్టులు, చెక్‌డ్యాంల నిర్మాణం ద్వారా 5.98క్షల ఆయకట్టుకు నీరు అందనుందన్నారు. 2010 నుంచి 14 వరకు అంటే తెలంగాణ రాకముందు వరకు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చిన నిధులు రూ. 104 కోట్లేనని అన్నారు. 2014 తర్వాత ఇప్పటి వరకు రూ. 874 కోట్లు నిధులు తీసుకువచ్చామని ఎంపీ వివరించారు.

షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు,
చెరుకు రైతులకు అండగా నిలిచాం..
బోధన్, నిజామాబాద్, కోరుట్ల షుగర్ ఫ్యాక్టరీలను రైతుల చేత కోఆపరేటివ్ పద్ధతిలో నడిపించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. దీనిని పరిశీలించడానికి అప్పుడు వ్యవసాయ మంత్రిగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి మ హారాష్ట్రకు వెళ్లి అధ్యయనం చేశారని ఎంపీ కవిత గుర్తుచేశారు. షుగర్‌ఫ్యాక్టరీ కార్మికులు, చెరుకు రైతులకు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు.

పసుపు బోర్డు ఏర్పాటుకు శక్తివంచన లేకుండా కృషిచేశా..
పసుపు బోర్డు ఏర్పాటుకు శక్తివంచన లేకుండా చిత్తశుద్ధితో కృషిచేశానని తెలిపారు. బోర్డు సాధన కోసం తాను ఎక్కని కొండ లేదు.. మొక్కని బండ లేదన్నారు. తను చేసిన కృషిని వివరించారు. సీఎం మద్ధతుల లేఖలను కూడగట్టి ప్రధానికి అందజేసిన బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పడు ఆ బీజేపీ నేతలే ఉల్టా చో ర్ కోత్వాల్‌కు డాంటే అన్న చందంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇలాంటి బీజేపీ నాయకుల ను రైతులు నిలదీయాలని కోరారు. పసుపు బోర్డు సాధన కోసం ప్రయత్నాలు ఆపబోమన్నారు. రై తుల కోసం, సాగునీటి కోసం తన ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. రాబోయే ఐ దేండ్లలో ప్రతి గ్రామంలో పేదలకు ఇండ్ల సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధిని కల్పిస్తూ వారి ఆదాయాభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. పసుపు, శనగ రైతులకు అండగా ఉంటామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.50వేల చొప్పున రుణాలు అందించామన్నా రు. రాబోయే రోజుల్లో రూ.2లక్షల వరకు బ్యాం కులతో సంబంధం లేకుండా రుణాలు అందిస్తామన్నారు. ముస్లిం, క్రిస్టియన్, సిక్కు తదితర మైనార్టీ వర్గాలకు న్యాయం చేస్తామన్నారు.

కాంగ్రెస్, బీజేపీ నేతల తీరు మారాలి..
రైతులకు ఏమీచేయని తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు వారి తీరు మార్చుకోకపోతే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేసే అమేథీ, వారణాసి నియోజకవర్గాలో నూ వెయ్యి మంది రైతులతో నామినేషన్లు వేయిస్తామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నా యకులు అమాయక గంగిగొవ్వులాంటి రైతుల మధ్య తోడేళ్లలా దూరి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎర్రజొన్న, పసుపు రైతుల సమస్య పరిష్కారం కోసం ఆది నుంచి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది టీఆర్‌ఎస్ మాత్రమేనని అన్నారు. టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ రైతు సమి తి కూడా అని ఆమె అభివర్ణించారు. 24 గంటల కరెంటు, నీటి తీరువా మాఫీ, రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలను రైతులకు అందిస్తున్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమే అన్నా రు. రైతుల కోసం ఇలాంటి పథకాలను అ మలు చేస్తూ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. రైతులకు ఏమి చేయని పార్టీలు నేడు నామినేషన్ల పేరిట రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి బే ధాలు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నా యకులను రైతులు నిలదీయాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ టీఆర్‌ఎస్ నెరవేర్చిందన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles