కేసీఆర్ సభకు తరలిన టీఆర్‌ఎస్ శ్రేణులు


Mon,March 18, 2019 01:14 AM

కథలాపూర్:కరీంనగర్‌లో సీఎం కేసీఆర్ సభకు కథలాపూర్ మండలంలోని టీఆర్‌ఎస్ నాయకులు ఆదివారం తరలివెళ్లారు. మండలంలోని 19 గ్రామాల నుంచి టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాహనాలల్లో తరలివెళ్లారు. ఆయా గ్రామాల్లో టీఆర్‌ఎస్ నాయకులు ర్యాలీగా వెళ్లి గ్రామశివారులనుంచి వాహనాలల్లో బయలుదేరారు. మండలంలో నుంచి 3 వేల మందిని తరలించినట్లు టీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు నాగం భూమయ్య, యూత్ మండలాధ్యక్షుడు గడిల గంగప్రసాద్, నాయకులు గడ్డం భూమరెడ్డి, గోపు శ్రీనివాస్, దొప్పల జలేందర్, ఎం.డీ రఫీ, పాలెపు రాజేశ్, జెల్ల వేణుగోపాల్, గుండారపు గంగాధర్, విద్యాసాగర్‌రావు, ప్రకాశ్, గంగరాజం, మహేందర్, స్వామి, జలేందర్ తదితరులు పాల్గొన్నారు.
మేడిపల్లి: కరీంనగర్‌లో జరుగుతున్న ముఖ్యమంత్రి కేసిఆర్ సభకు ఆదివారం టీఆర్‌ఎస్ పార్టీ మేడిపల్లి మండల కార్యకర్తలు బస్సులు, కార్లు తదితర వానాలలో పెద్ద సంఖ్య లో బయలు దేరారు. అన్ని గ్రామాల నుంచి స్వచ్ఛందంగా ప్రజలు కేసీఆర్ సభకు తరలివెళ్లినట్లు టీఆర్‌ఎస్ పార్టీ మం డలాధ్యక్షుడు సుధవేని గంగాధర్ తెలిపారు. తరలిన వారిలో జడ్పీ సభ్యురాలు నెల్లుట్ల పూర్ణిమ, ప్రభాకర్, ఎంపీపీ కుందారపు అన్నప్రూర్ణ, రవీందర్, సర్పంచ్ ద్యావనపెల్లి అభిలాష్, టీఆర్‌ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు నల్ల మహిపాల్‌రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.

81

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles