కమనీయం.. వేంకటేశ్వరుడి కల్యాణం

Mon,March 18, 2019 01:14 AM

మల్లాపూర్: మండలంలోని రాఘవపేటలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం కన్నుల పండువగా స్వామి వారి కల్యాణ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాధవచార్యులు, శ్రీనివాసచార్యుల ఆధ్వర్యంలో మంగళహారతులు, డప్పుచప్పుళ్లు, మంగళహారతులతో స్వామి పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం హోమం, కుంకుమపూజ, తదితర ప్రత్యేక పూజలను చేయడంతో పాటు, వేద మంత్రోచ్ఛరణల మధ్య కల్యా ణాన్ని జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడ మెట్‌పల్లి సీఐ రవికుమార్, ఎస్‌ఐ పృథ్వీధర్, సర్పంచ్ నత్తి లావణ్య, ఎంపీటీసీ గురిజెల నర్సయ్య, సింగిల్‌విండో చైర్మన్ గురిజెల లక్ష్మీనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తోట శ్రీనివాస్, మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ మర్రి ఉమారాణితో పాటు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఆలయ అభివృద్ధ్ది కమిటీ సభ్యులు పాల్గొనగా పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

42
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles