వికల్ప-2019 చాంపియన్ షిప్ అందుకున్న రామకృష్ణ విద్యార్థులు

Mon,March 18, 2019 01:14 AM

జగిత్యాల లీగల్ : శాతవాహన విశ్వవిద్యాలయం వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో వికల్ప - 2019పేరిట నిర్వహించిన కామర్స్ మీటింగ్‌లో జిల్లా కేంద్రంలోని రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు పలు అంశాలల్లో విజేతలుగా నిలిచి ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్ యాద రామకృష్ణ తెలిపారు. ఆ దివారం ఆయన మాట్లాడుతూ డిగ్రీ, పీజీ విద్యార్థులకు పోటీలను నిర్వహించగా యూనివర్సిటీ పరిధిలోని సుమారు 25 కళాశాలల వి ద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఎక్కువ విభాగాల్లో జిల్లా కేంద్రంలోని రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు విజేతలు ఓవరాల్ చాంపియన్ షిప్ కైవసం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వి ద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ యాద రామకృష్ణ, ప్రిన్సిపాల్ కొ క్కుల రాజేందర్, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.

34
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles