సాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి

Sun,March 17, 2019 12:42 AM

మేడిపల్లి: ఒకరికి సాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉందని ఏఆర్‌డీ ఎస్పీ చెల్ల ప్రతాప్ అన్నారు. మండలంలోని కొండాపూర్ గ్రామంలోని నిరుపేద గడుగు లక్ష్మీరాజం కుటుంబానికి రూ.లక్షా 60వేల దాతల సాయంతో నిర్మించిన ఇంటిని ఆయన శనివారం అప్పగించారు. అనారోగ్యంతో భార్య లక్ష్మి మృతి చెందగా లక్ష్మీరాజం తన ముగ్గురు కూతుళ్లతో పూరి గుడిసెలో నివసిస్తూ ఆర్థిక ఇబ్బందులు పడుతుండడంతో ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ ఫేస్‌బుక్‌లో వీరి దీనస్థితిని వివరిస్తూ పోస్టు పెట్టాడు. దీంతో దాతలు రూ.లక్షా 60వేలు ఆర్థికసాయం అందించగా స్నానాల గది, మరుగుదొడ్డి వసతులతో ఇంటిని నిర్మించారు. ఈ ఇంటిని శనివారం ఏఆర్‌డీ ఎస్పీ ప్రతాప్ లక్ష్మీరాజంకు అప్పగించారు. అలాగే కొండాపూర్‌కు చెందిన మార్కండేయ యూత్ సభ్యులు రూ.22వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించి బాండ్‌ను ప్రతాప్ చేతుల మీదుగా పిల్లలకు అందజేశారు. లక్ష్మీరాజం కుటుంబానికి సహకారమందించిన రేణికుంట రమేశ్, ఎర్రం రమేశ్‌లను ప్రతాప్, గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ ద్యావనపెల్లి అభిలాష్, జగిత్యాల మిత్ర హాస్పిటల్ డాక్టర్ వాసాల ప్రతిమ, సామాజిక సేవకురాలు బోనాల సునీత, రిటైర్డ్ ప్రిన్సిపాల్ నారాయణ, జగిత్యాల సత్యసాయి అభయ హస్తం సభ్యులు పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles