ఇంటర్ విద్యార్థుల ఘర్షణ

Sun,March 17, 2019 12:42 AM

- జగిత్యాలకు చెందిన సాయిచరణ్ పరిస్థితి విషమం
కరీంనగర్ క్రైం: విద్యార్థుల మధ్య ఘర్షణ చినికిచినికి గాలివానలా మారి ఒకరి పరిస్థితి విషమంగా మారింది. పరీక్షలు ముగిసి ఇంటికి వెళ్తు న్న సమయంలో పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని ఓ విద్యార్థిపై మరో విద్యార్థి అతడి స్నేహితులతో కలిసి దాడి చేయడంతో బాధిత విద్యార్థి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. రెండు రోజుల క్రితం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో జరిగిన ఈ ఘట న వివరాలు.. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సాయిచరణ్, ఆల్ఫోర్స్ హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గతంలో ఓ సహచర విద్యార్థి ర్యాగింగ్ పేరిట ఇతడిని వేధించడంతో తల్లిదండ్రులు, యజమాన్యం దృష్టి కి తీసుకెళ్లాడు. తర్వాత కొంతకాలం మామూలుగానే ఉన్నా ఇంటర్ పరీక్షల చివరి రోజు పరీక్ష రాసి బయటికి వచ్చిన సాయిచరణ్‌ను, నవీన్ అనే విద్యార్థి తన స్నేహితులతో కలిసి విపరీతంగా కొట్టాడు. సాయిచరణ్ హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత అనారోగ్యానికి గురవడంతో విష యం బయటపడింది. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే గాయాలతో కుప్పకూలడంతో దవాఖానకు తీసుకెళ్లగా పరిస్థితి అంతు చిక్కలేదు. వెంటనే కరీంనగర్‌కు తరలించగా తలపై బలమైన గాయాలైన మెదడులో రక్తం గడ్డ కట్టి కోమాలోకి వెళ్లినట్లు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. సాయిచరణ్ తండ్రి జనార్దన్ ఈ విషయంపై కొత్తపల్లి పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. శనివారం సాయిచరణ్ సోదరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ స్వరూప్‌రాజ్ తెలిపారు.

46
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles