వేటగాడి ఉచ్చుకు మనువోతు బలి

Sun,March 17, 2019 12:41 AM

-విద్యుదాఘాతంతో చంపి మాంసం విక్రయానికి ప్రయత్నం
-పట్టుకున్న అటవీ అధికారులు
ఇబ్రహీంపట్నం:మండలంలోని యామాపూర్ శివారు రత్నాల మడుగు అటవీ ప్రాంతం సమీపంలోని వ్యవసాయ పంట పొలంలో వేటగాడు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి ఓ మనువోతు (నీలుగాయి) మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. మెట్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి రాజేశ్వర్‌రావు తెలిపిన వివరాల మేరకు.. ఫకీర్ కొం డాపూర్‌కు చెందిన మ్యాకల భూమయ్య అనే వేటగాడు శుక్రవారం రాత్రి వ్యవసాయ పంట పొలం వద్ద విద్యుత్ తీగలను అమర్చి నీలుగాయిని హతమార్చాడు. చనిపోయిన నీలుగాయిని శనివారం కోస్తుండగా, సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు వెళ్లి పట్టుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మనువోతుకు వెటర్నరీ డా క్టర్ స్వాతి పోస్ట్‌మార్టం చేసి, స్థానికంగానే దహ నం చేశారు. భూమయ్యపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపర్చారు. ఇక్కడ సెక్షన్ అధికారి సకారం, వేములకుర్తి బీట్ అధికారి ఖజా నజీరొద్దీన్ ఉన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles