విజయీభవ..

Sat,March 16, 2019 12:56 AM

మెట్‌పల్లి, నమస్తేతెలంగాణ/ జగిత్యాల టౌన్: జిల్లాలో నేటి నుంచి ఏప్రిల్ 3దాకా కొనసాగే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 68పరీక్ష కేంద్రాల్లో 13,210 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి లో 6,505 మంది బాలురు, 6,705 మంది బా లికలుండగా రెగ్యులర్ సెంటర్లు 67, ఒక ప్రైవేట్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఉదయం 9.15గంటల నుంచి మధ్యాహ్నం 12.15గంటల వరకు పరీక్ష సమయం కాగా, ఉదయం 9.15గంటలకు పరీక్ష పత్రాలను విద్యార్థులకు అందజేస్తారు. 15నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. మాస్ కాఫీయింగ్, మాల్ ప్రాక్టీస్ నిరోధానికి జిల్లాలో నాలుగు ఫ్లయింగ్ స్వాడ్స్, ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక సిట్టింగ్ స్వాడ్‌ను నియమించారు. ఒక్కో ఫ్లయింగ్ స్కాడ్ బృందంలో నలుగురు సభ్యులుంటారు. వీరిలో విద్య, రెవె న్యూ, పోలీస్, పీఆర్ శాఖల నుంచి ఒక్కో అధికా రి ఉంటారు. విద్యా శాఖేతర అధికారి సిట్టింగ్ స్కాడ్‌గా విధులు నిర్వహిస్తారు. పరీక్ష కేం ద్రంలో ఒక చీఫ్ సూపరిండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారి, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇన్విజిలేటర్లను నియమించారు. 68 మంది ఛీఫ్ సూ పరిండెంట్లు, 68డిపార్ట్‌మెంటల్ అధికారులు , 1 అడిషనల్ డిపార్ట్‌మెంటల్ అధికారి, రాష్ట్ర స్థాయి పరీక్షల అబ్జర్వర్, మొత్తంగా 755మంది ఇన్విజిలేటర్లు పరీక్షల నిర్వహణ చూస్తారు. సెంటర్‌కు ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, డిహైడ్రేషన్, జ్వరానికి సంబంధించిన మాత్రలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. పదో తరగతి విద్యార్థుల హాల్‌టికెట్లు సంబంధిత పాఠశాలలకు చేరాయనీ, ఎవరికైన రాని పక్షంలో నెట్ నుంచి (BSC.TELANGANA.COM) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై గెజిటెడ్ అధికారి సంతకం తీసుకుం టే సరిపోతుంది. పదో తరగతి పరీక్షలపై విద్యార్థులకు ఎలాంటి అనుమానాలున్నా జిల్లా విద్యాధికారి కార్యాలయం 08724-222216 నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఈ ఫోన్ 24గంటలూ అందుబాటులో ఉంటుంది. ప్రతి సెంటర్ వద్ద జిల్లా విద్యాధికారి 79950 87619, సంబంధిత మండల విద్యాధికారి ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయి.

హ్యాట్రిక్‌పై దృష్టి
గత రెండేండ్లుగా పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లా రాష్ట్రంలో వరుసగా మొదటి స్థానం లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా మొదటి స్థానంలో నిలిపి హాట్రిక్ సాధించాలని జిల్లా విద్యా శాఖ అధికార యంత్రాంగం పట్టుదలతో ఉన్నది. ప్రధానంగా కలెక్టర్ శరత్ ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించారు. ఉత్తేజం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయడంతో పాటు రోజూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతు లు నిర్వహించారు. ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు శ్రద్ధ చూపేలా మండలాల వారీగా సం బంధిత పాఠశాలల హెచ్‌ఎంలు, సబ్జెక్ట్ ఉపాధ్యాయులతో కలెక్టర్ సమీక్షలు నిర్వహించారు.

పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తాం
పదో తరగతి పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగకుండా నిర్వహిస్తాం. పరీక్ష గదిలో ఇతరులతో మాట్లాడడం, జవాబు పత్రాలను తారుమారు చేసుకోవడం నిషేధం, ప్రింటెడ్ మెటిరియల్ పేపర్‌పై రాసిన మెటిరియల్ విద్యార్థులు, నిర్వాహకుల వద్ద ఉండవద్దు. ప్రత్యేకంగా ఒక విద్యాసంస్థకు చెందిన విద్యార్థులకు పరీక్షలో నిర్వహణాధికారులు సహకరించడం నేరం. పరీక్షల నిర్వహణ అధికారులు ఫోన్లు, సెల్ ఫోన్లు పరీక్షా సమయంలో వినియోగించవద్దు. పరీక్ష సమయంలో ఉద్దేశ్య పూర్వకంగా విధులను ఆశ్రద్ధ చేయడం, ఆటం కం కలిగించడం నేరం. పైన తెలిపినవి పాటించని వారిపై ACT 25, 1997 ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. కనీసం 6 నెలల నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.5వేల నుంచి రూ.లక్ష జరిమానా విధించే అవకాశముంది. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం.
-ఎస్.వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి

విద్యార్థులు ఇవి పాటించాలి
- పరీక్ష కేంద్రానికి ఉదయం 8.45గంటలకే చేరుకోవాలి.
- ఈ పరీక్షలు కూడా పాఠశాలలో రాసిన ఫార్మేటివ్, సమ్మెటివ్ వంటివే కాబట్టి ఆందోళన చెందవద్దు.
- ప్రశ్నాపత్రాన్ని చదివేందుకు 15 నిమిషాల సమయం ప్రత్యేకంగా కేటాయించారు. ఒకటికి రెండు సార్లు ప్రశ్నాపత్రాన్ని బాగా చదవాలి.
- ప్రతి పేజీలో మార్జిన్ వదిలి పెట్టాలి. ప్రశ్న సం ఖ్యను మార్జిన్‌లో వేయాలి.
- మొదట బాగా తెలిసిన ప్రశ్నలకు జవాబులు రాయాలి. గణితం, సామాన్య, సాంఘీక శాస్త్రం లో 1 మార్కు, 2 మార్కులు, 4 మార్కుల సమాధానాలు ఒక చోట రాయాలి.
- జవాబు మాత్రమే రాయాలి, ప్రశ్నలు రాయాల్సిన అవసరం లేదు.
- జవాబును పాయింట్ల రూపంలో రాయాలి. ప్రతి పాయింట్‌కు మార్కులు కేటాయిస్తారు. ప్రతి జవాబుకు, హెడ్డింగ్ తప్పక రాయాలి. దీన్ని అండర్‌లైన్ చేయాలి. సమాధానంలోని అక్షరాల సైజ్, హెడ్డింగ్‌లోని అక్షరాల కంటే చిన్నవిగా ఉండాలి.
- చేతి రాత చక్కగా ఉండేలా చూసుకోవాలి. అక్షర దోశాలు లేకుండా జాగ్రత్త పడాలి.
- సమాధానంలోని ముఖ్య పదాల కింద గత గీయడం ద్వారా వాటి ప్రాముఖ్యత తెలుపాలి.

- అబ్జెక్టివ్ పేపర్‌లో కొట్టివేతలు, రాసిన వాటిపై రెండు సార్లు (దిద్దడం) రాయవద్దు.
- ప్రతి పేజీలో 12 నుంచి 14 వరుసల్లో జవా బులు రాయాలి. ప్రారంభంలో ఎలా రాశామో చివరి వరకూ అలాగే ఉండాలి. పదాను విడగొట్టి రాయకూడదు.
- సమాధానం తప్పయితే ఒకేసారి మొత్తం కొ ట్టివేసి WRONG అని రాయాలి.
- పేజీ చివర కొద్ది ప్రదేశం మిగిలి ఉంటే ఇంకో జవాబు రాయద్దు. తర్వాత పేజీలోనే రాయా లి. చెత్త రాతలు, పాస్ చేయండి అనే ప్రా ర్థనలు రాయోద్దు.
- హాల్ టికెట్, బస్ పాస్ తప్ప ఎలాంటి కాగితాలూ మీవద్ద ఉండవద్దు.
- హాల్ టికెట్ నంబర్‌ను ఎక్కడా రాయకూ డదు. మీకు ఇచ్చిన OMR SHEETలో మీ పేరు HAL- TICKET ముద్రించి ఉంటా యి. సరి చూసుకుంటే చాలు. తప్పులుంటే BLANK OMR SHEET నింపాలి.
- PENCIL, ERASER, SCHALE త ప్పకుండా తీసుకెళ్లాలి.
- ఫోన్లు, క్యాలిక్యులేటర్లు తీసు కెళ్లకూడదు.
- LETTER WRITING, TELUGU, HINDHI, ENGLISH తో పాటు సాం ఘీక శాస్త్రంలో కూడా వచ్చే అవకాశ ముంది. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. LETTERలో మీ పేరు HAL- TICKET నంబర్ రా యకూడదు. XXXXతో సూచించాలి.
- GRAPH, MAPS, OBJECTIVE PAPERపై MAIN ANSWER SHEETపై ఉన్న సీరియల్ నంబర్ మాత్రమే వేయాలి. (హాల్ టికెట్ నంబర్ వేయవద్దు)

31
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles