సర్వం సిద్ధం

Fri,March 15, 2019 12:37 AM

- పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
- 16నుంచి ఏప్రిల్ 3దాకా నిర్వహణ
- హాజరుకానున్న విద్యార్థులు : 13,210
- జిల్లాలో 68కేంద్రాలు
- ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:15 వరకు
- 5నిమిషాల వరకు సడలింపు
- 8:45లోపే సెంటర్లకు చేరుకోవాలి : డీఈవో వెంకటేశ్వర్లు
జగిత్యాల రూరల్ : జిల్లాలో శనివారం నుంచి ప్రారంభమై ఏప్రిల్ 3దాకా జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 67 ప్రభుత్వ పాఠశాలు, 1 ప్రైవేట్ పాఠశాల కలిపి 68 కేంద్రాలు ఏర్పాటు చేయగా వీటిలో మొత్తం 13,210మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జిల్లాలో 13 రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలుండగా వీటిలో 258మంది బాలురు, 328మంది బాలికలు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. జడ్పీ ఉన్నత పాఠశాలలు 182కాగా 3001మంది బాలురు, 3047మంది బాలికలు హాజరుకానున్నారు. టీఎస్‌టీడబ్ల్యూఆర్‌ఎస్ పాఠశాల 1ఉండగా ఇందులో 69మంది బాలురు, రెసిడెన్షియల్ స్కూళ్లు రెండు ఉండగా వీటిలో 68మంది బాలురు, 76మంది బాలికలు, 14 కేజీబీవీలుండగా 525మంది బాలికలు, టీఎస్ మోడల్ స్కూళ్లు 13ఉండగా వీటిలో 532మంది బాలురు, 682మంది బాలికలు పరీక్ష రాయనున్నారు. జిల్లాలో మొత్తం 215 సర్కారు బడుల నుంచి 3928మంది బాలురు, 4653మంది బాలికలు మొత్తంగా 8581మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రైవేట్ పాఠశాలలు 106ఉండగా 2557మంది బాలురు , 2052మంది బాలికలు మొత్తం 4629 మంది విద్యార్థులున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మొత్తం 321కాగా 6505మంది బాలురు, 6705మంది బాలికలు మొత్తం 13,210మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. గతేడాది పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు బాలురు 108మంది, బాలికలు 55మంది ఉండగా మొత్తం 163మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

68కేంద్రాలు.. 755మంది ఇన్విజిలేటర్లు
జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 68 పరీక్షా కేంద్రాల పర్యవేక్షణకు అధికారులను నియమించారు. 68మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 68మంది డిపార్ట్‌మెంట్ అధికారులు, ఒక అడిషనల్ డిపార్ట్‌మెంట్ అధికారి, ఒక స్టేట్ లెవెల్ అబ్జర్వర్, నాలుగు ఫ్లయింగ్ స్కాడ్లు, 19 సెంటర్ కస్టోడియన్లు, 755మంది ఇన్విజిలేటర్లు పరీక్షలను పర్యవేక్షించనున్నారు.

ఉదయం 8:45లోగా చేరుకోవాలి
- ఎస్ వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి
పదో తరగతి పరీక్షలు ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:15గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి 8:45గంటలలోపు చేరుకోవాలి. ఒరిజినల్ హాల్ టికెట్‌ను తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. హాల్‌టికెట్ నంబర్‌ను ఎక్కడా వేయరాదు. మెయిన్ షీట్ నంబర్‌ను ఓఎంఆర్ షీట్‌పై రెండుచోట్ల వేయాలి. పరీక్ష ముగిసిన తర్వాత జవాబు పత్రంపై సమాప్తం అని రాయాలి. జవాబులు రాసే క్రమంలో కొట్టివేతలు ఉంటే రాంగ్ అని రాయాలి. విద్యార్థులు కేంద్రానికి తెల్ల కాగితాలు తేవద్దు. బూట్లు వేసుకొని పరీక్షలకు హాజరు కావద్దు. కంపాక్స్ బాక్సులను వెంట తెచ్చుకోవచ్చు. పరీక్షలు రాసే సమయంలో బ్లాక్, బ్లూ పెన్నులను మాత్రమే ఉపయోగించాలి. సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు.

ఇదీ.. షెడ్యూల్
తేది వారం పేపరు
మార్చి 16 శనివారం తెలుగు-1
మార్చి 18 సోమవారం తెలుగు-2
మార్చి 19 మంగళవారం హిందీ
మార్చి 20 బుధవారం ఇంగ్లిష్-1
మార్చి 23 శనివారం గణితం-1
మార్చి 25 సోమవారం గణితం-2
మార్చి 26 మంగళవారం జనరల్ సైన్స్-1
మార్చి 27 బుధవారం జనరల్ సైన్స్-2
మార్చి 28 గురువారం సోషల్-1
మార్చి 29 శుక్రవారం సోషల్-2
మార్చి 30 శనివారం (సంస్కృతం, అరబిక్, పర్షియన్)-1
ఏఫ్రిల్ 01 సోమవారం (సంస్కృతం, అరబిక్, పర్షియన్)-2
ఏఫ్రిల్ 02 మంగళవారం ఒకేషనల్ థియరీ
ఏఫ్రిల్ 03 బుధవారం ఇంగ్లిష్-2

56
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles