పాతూరితోనే సమస్యలకు పరిష్కారం

Fri,March 15, 2019 12:34 AM

-పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం:కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి పాతూరి సుధాకర్‌రెడ్డిని గెలిపిస్తేనే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అట్ల శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు గురువారం మండలంలోని గోధూర్, తిమ్మాపూర్, ఎర్దండి, వేములకుర్తి, ఇబ్రహీంపట్నం, వర్షకొండ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులతో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధన, సీపీఎస్ రద్దుకు కృషి చేయాడానికి పాతూరికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇక్కడ నాయకులు గాదె నర్సింగరావు, గంగుల దామోదర్, ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.

సారంగాపూర్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పా తూరి సుధాకర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు చొల్లేటి శ్రీనివాస్ అన్నారు. సారంగాపూర్ మండ ల కేంద్రంలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి, ప్ర భుత్వ విప్, ప్రస్తుత ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఏకీకృత సేవా నిబంధనలు న్యా యస్థానంలో పరిష్కరించి ఉపాధ్యాయులకు ఎం ఈవోలుగా, ఉప విద్యాధికారులుగా, డీఈడీ, బీ ఈడీ కళాశాల అధ్యాపకులకు పదోన్నతులు కల్పించేందుకు, 11వ పీఆర్సీ కమిటీ నివేదిక ఆధారం గా మెరుగైన వేతన స్కేళ్లు, భాషా పండితుల, పీఈటీ పోస్టులు స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ ఉత్తర్వులు అమలుకు, రూ.398స్పెషల్ టీచర్లకు రెండు నోషనల్ ఇంక్రీమెంట్లు కల్పనకు, నూతన జిల్లాలు, మండలాలకు విద్యాధికారి పోస్టుల మంజూరుకు కృషి చేస్తారన్నారు. సీపీఎస్ రద్దుకై అధ్యాయన కమిటీని ఏర్పాటు, నూతన జిల్లా కేం ద్రాల్లో టీఎస్‌జిఎల్‌ఐ కేంద్రాలు ఏర్పాటు, సాంఘీక శాస్త్రం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెం చేందుకు పాతూరి కృషి చేస్తారన్నారు.

సుధాకర్‌రెడ్డినే గెలిపించాలి
-తెలంగాణ రాష్ట్ర టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి
మల్యాల:కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు చేసి పాత పెన్షన్ స్కీంను వర్తింపజేయడం, 11వ వేతన సవరణను ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల ఆకాంక్షలకు అనుగుణంగా మంచి ఫిట్‌మెంట్ సాధించడం కోసం మరోమారు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ కరీంనగర్ టీచర్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీగా పాతూరి సుధాకర్ రెడ్డిని గెలిపించాలని టీఎస్టీయూ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు వి సత్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. మల్యాల మండలంలోని ఉ పాధ్యాయులను, అధ్యాపకులను కలిసి పాతూరిని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తొ మ్మిది వేతన సవరణల కాలంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంత 43శాతం ఫిట్‌మెంట్‌తో పాటు 18 నెలల వేతన సవరణ కాలానికి సంబంధించిన బకాయిలను ఇప్పించిన నాయకుడు పాతూరి అని పేర్కొన్నారు. మహిళా ఉపాధ్యాయులకు శిశు సంరక్షణ సెలవు, భాషా పండితులకు, పీఈటీలకు సంబంధించిన 10వేలకు పైగా పో స్టులను ఉన్నతీకరణ విషయం ముఖ్యమం త్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సాధించిన ఘనత పాతూరికే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యం, సమస్యలపై ఉన్న దీర్ఘకాలి క అనుభవం, నిజాయితీగా పనిచేసే లక్షణం ఉన్న నాయకుడు అని, దశాబ్దాల కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించబడుతున్న ప్రస్తుత తరుణంలో ఉపాధ్యాయులు, అధ్యాపక ఓటర్లు ఆలోచించి పాతూరి సుధకార్ రెడ్డినే గెలిపించాలని కోరారు. సుప్రీం కోర్టు మ ధ్యంతర తీర్పు నేపథ్యంలో సర్వీసు నిబంధనలను రూపొందించి పదోన్నతులు చేపట్టడం రూ.398 వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు రెండు నోషనల్ ఇంక్రీమెంట్లు, ఆదర్శ, కేజీబీవీ, జూనియర్ కళాశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేసే నా యకుడు సుధాకర్‌రెడ్డి అన్నారు. ఇక్కడ సంఘ నాయకులు అంజిరెడ్డి, సత్యనారాయణ, ష రీ ఫ్, శ్రీనివాస్ రెడ్డి, రాంరెడ్డి, తదితరులున్నారు.

49
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles