చకచకా సదర్మాట్

Fri,February 22, 2019 12:42 AM

మెట్‌పల్లి,నమస్తేతెలంగాణ: జగిత్యాల, నిర్మల్ జిల్లాల సరిహద్దులో గోదావరిపై నిర్మిస్తున్న సదర్‌మాట్ బ్యారేజీ, రాబోయే రోజుల్లో రెండు జిల్లాలకు వరప్రదాయని కానున్నది. రెండు జి ల్లాల్లో వేలాది ఎకరాలు సస్యశ్యామలం కావడం తో పాటు తీర గ్రామాలకు తాగునీటి సమస్య శాశ్వతంగా తీరనున్నది. ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్, నిర్మల్ జిల్లా మామడ మండ లం పొన్కల్ శివారు మధ్య గోదావరిపై రాష్ట్ర స ర్కారు రూ. 516.23 కోట్ల అంచనా వ్యయంతో సదర్మాట్ బ్యారేజీ నిర్మాణం చేపట్టింది. నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని ఖానాపూర్, కోరుట్ల నియోజకవర్గాల్లో సుమారు 17,900 ఎకరాలకు సాగునీరు, పలు గ్రామాలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో 1.58 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తో నిర్మిస్తున్నది. ప్రస్తుతం పనులు చివరి దశకు చేరుకున్నాయి. బ్యారేజీ కోసం ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్, ఎర్దండి, కోమటి కొం డాపూర్ శివారులో సుమారు 351 ఎకరాలు. నిర్మల్ మండలం పొన్కల్ పరిసర ప్రాంతాల్లో 754 ఎకరాల భూ సేకరణ చేపట్టి పరిహారం చె ల్లింపు కూడా దాదాపు పూర్తయింది. వాన కాలంలోపు బ్యారేజీ పనులు పూర్తి చేయాలని ప్రభు త్వం పట్టుదలతో ఉంది. ఆ దిశగా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

55గేట్లతో బ్యారేజీ
జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో సదర్మాట్ మరో పెద్ద ప్రాజెక్ట్‌గా ప్రసిద్ధి చెందనుంది. అంచనా వ్య యం రూ. 516. 23 కోట్లు కాగా రూ.318.53 కోట్లు బ్యారేజీకి, మిగతావి పరిహారం చెల్లింపు, ఇతర పనులకు ప్రభుత్వం కేటాయించింది. కాగా తాజాగా అంచనా వ్యయం రూ.520.39 కోట్లకు పెరిగింది. గోదావరిలో అడ్డుగా 987 మీటర్ల పొ డవు, కింది భాగం నుంచి పైకి 30 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తున్నారు. 1.58 టీఎంసీల కంటే ఎక్కువ నీరు చేరినప్పుడు, లేదా దిగువన అత్యవసర సమయాల్లో నీటి అవసరం ఉన్నప్పుడు విడుదల కోసం 55గేట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యారేజీ చుట్టూ 2.8కి.మీటర్ల పొడవునా మట్టి కట్టలు నిర్మిస్తున్నారు. గేట్ల ద్వారా సుమారు 12 కి.మీటర్ల దూరంలో ఎడమ వైపు ఉన్న సదర్మాట్ ఆనకట్టుకు సైతం నీటిని విడుదల చేస్తారు. ఐదు కి.మీటర్ల దూరంలో కుడివైపు ఉన్న గంగనాల ప్రాజెక్ట్) సైతం నీటిని విడుదల చేసే అవకాశముం ది. ఈ రెండు ఆనకట్టల కిందా ఆయకట్టుకు సాగునీరందడమే కాకుండా రెండు జిల్లాల సమీప గ్రా మాల్లో సాగు , తాగునీటి కష్టాలు తీరనున్నాయి.

అక్టోబర్ కల్లా పూర్తి
సదర్‌మాట్ బ్యారేజీ పనులు వచ్చే అక్టోబర్ చివరికల్లా పూర్తవుతాయి. ఇప్పటి వరకు 50 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఈ ఫిబ్రవరి వరకే పూర్తి కావాల్సి ఉన్నా కొన్ని సాంకేతిక కారణాల వల్ల కాలేదు. నిర్మాణ పనుల గడువును ప్రభుత్వం అక్టోబర్ వరకు పొడిగించింది. గడువులోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. సదర్మాట్ ఆనకట్ట పరిధిలో 13,100 ఎకరాలు, గంగనాల ప్రా జెక్ట్ పరిధిలో 4800 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించడం ఈ బ్యారేజీ లక్ష్యం.
- జగదీశ్, డీఈఈ, నీటి పారుదల శాఖ

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles