పాసిగామను స్తంభంపల్లి స్థానంలో కలపాలి

Fri,February 22, 2019 12:41 AM

వెల్గటూరు: మండలంలోని పాసిగామ గ్రామాన్ని స్తంభంపల్లి ఎంపీటీసీ పరిధిలో చేర్చాలని కోరుతూ ఆయా గ్రామాల ప్రజలు గురువారం ఎంపీడీఓ సంజీవరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్తంభంపల్లి, వెంకటాపూర్, కుమ్మరిపల్లి గ్రామాలతో కలిపి స్తంభంపల్లి ఎంపీటీసీ, వెల్గటూరు, కోటిలింగాల, పాసిగామలతో కలిపి వెల్గటూరు ఎంపీటీసీగా ఏర్పాటు చేస్తూ డ్రాఫ్ట్ విడుదల చేశారనీ, గతంలో ధర్మపురి మండలంలో ఉండగా పాసిగామ, వెంకటాపూర్ స్తం భంపల్లి గ్రామాలు కలిసి ఒకే పరిధిలో ఉండేవన్నారు. స్తంభంపల్లి రెవెన్యూ పరిధిలోని పాసిగామను స్తంభంపల్లిలోనే కొనసాగించాలన్నారు. ఇక్కడ పాసిగామ సర్పంచ్ తిరుపతి, ఉపసర్పంచ్ భూమయ్య, నాయకులు పొడేటి రవి, అత్తె వెంకయ్య, కోన శంకరయ్య, నరేశ్, బరుపటి తిరుపతి ఉన్నారు.

ఎంపీటీసీ స్థానాలు పెంచాలి
బుగ్గారం : మండలంలో కొత్త ఎంపీటీసీ స్థానాలను పెంచాలని ఎండీసీ కన్వీనర్ ఎన్నం కిషన్‌రెడ్డి కోరారు. గురువారం బు గ్గారంలోని ఎండీసీలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ బుగ్గారం మండలంగా ఆవిర్భవించి రెండున్నర సంవత్సరాలు గడుస్తుందన్నారు. ఐదువేలకు పైచీలుకు జనాభా ఉన్నా.. గతంలోలానే చిన్నాపూర్, చంద్రయ్యపల్లె గ్రామాలతో కలిపి ఒకే ఎంపీటీసీ స్థానం కొనసాగించడం సరికాదన్నారు. బుగ్గారాన్ని ప్రత్యేక స్థానం, చిన్నాపూర్, చందయ్యపల్లెలను కలిపి మరో ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేయాలనికోరారు. 11 గ్రామాలతో ఏర్పాటైన మండలంలో బుగ్గారం, గోపులాపూర్, వెల్గొం డ, మద్దునూర్, బీర్‌సాని, సిరికొండతో పాటు శెకళ్ల, యశ్వంతరావుపేట కలిపి ఎంపీటీసీ స్థానాలున్నాయన్నారు. గ్రామాల అభివృద్ధికి బీఆర్‌సాని, యశ్వంతరావుపేట, గంగాపూర్ గ్రామాలకు కొత్తగా ఎంపీటీసీ స్థానాలుగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయమై శుక్రవారం కలెక్టర్‌ను కలిసి, వినతిపత్రం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ కో కన్వీనర్ చుక్క గంగారెడ్డి, సభ్యులు ఉన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles