జగిత్యాల పట్టణాన్ని మోడల్‌గా అభివృద్ధి చేసుకుందాం

Thu,February 21, 2019 12:27 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ:జగిత్యాల పట్టణాన్ని మోడల్‌గా అభివృద్ధి చేసుకుందామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొ న్నారు. జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్లు, జగిత్యా ల అర్బన్, రూరల్ తహసీల్దార్లు, డీడీఎఫ్ కన్సల్టె న్సీ ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎ మ్మెల్యే సంజయ్ హాజరై మాట్లాడుతూ దేశంలో అత్యధిక పట్టణ జనాభా కలిగిన రాష్ర్టాలలో తెలంగాణ ఒకటిగా ఉందన్నారు. అలాంటి రాష్ట్రంలో ఉన్న జగిత్యాల పట్టణానికి కూడా ప్రాముఖ్యత ఉందన్నారు. 1969లో ఏర్పాటైన మాస్టర్ ప్లాన్‌ను 1989లో అమలు చేశారనీ, అనంతరం మళ్లీ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించలేదన్నారు. జగిత్యాల మున్సిపల్ పరిధి కేవలం 17 కిలోమీటర్లు మాత్రమేనని, కానీ జనాభా మాత్రం లక్షకుపైగా ఉందన్నారు. అదే మన జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో కోరుట్లలో 70వేల జనాభా ఉండగా, 25 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉందని, అలా గే మెట్‌పల్లిలో కూడా 40 వేల జనాభా ఉండగా, 15 కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలో ఉందని వివ రించారు. జగిత్యాల పరిసర గ్రామాల విలీనంపై గతంలో అధికారులు సరిగా పనిచేయలేదన్నారు. ఇప్పటికైనా సమీప గ్రామాలను విలీనం చేసుకుని మున్సిపల్ నిధులతో పూర్తిగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. జగిత్యాల మున్సిపాలిటీలో చిన్న చిన్న సంధులు ఉ న్న వార్డులు చాలా ఉన్నాయనీ, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కట్టుకున్నా భవనా సెట్‌బ్యాక్ ఉండేలా అధికారులు చూడాలన్నారు. కనీ సం అంబులెన్సు లాంటి వాహనాలు వెళ్లెలా చూ డాలన్నారు.

అలాగే జగిత్యాల మున్సిపాలిటీకి బై పాస్ రోడ్డు ఉండాలని, ఇప్పుడున్నా బైపాస్ కంటే మంచిగా నిర్మించుకోవాలన్నారు. అలాగే ము ఖ్యంగా నిజామాబాద్-ధర్మపురి రోడ్డుకు లిం కు కలిపేలా బైపాస్ నిర్మించుకోవాలన్నారు. జగిత్యా ల మున్సిపల్‌కు కనీసం 50 ఏళ్ల ప్రణాళిక రూపొందించి, 20 ఏళ్లకు అనుగుణంగానైనా మాస్టర్ ప్లాన్‌ను అమలు చేసుకోవాలన్నారు. ప్రజ ల సహకా రం, అభిప్రాయ సేకరణతో పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి, జగిత్యాలను ముందంజలో ఉంచుతామని మున్సిపల్ అధ్యక్షురాలు విజయలక్ష్మీ పే ర్కొన్నారు. ఇది అంచనా మాత్రమేనని పూర్తి స్థా యిలో డ్రాఫ్టింగ్ కాలేదనీ, ప్రజల సలహాలు, సూ చనలు స్వీకరించి అనంతరం వాటికి అనుగుణంగా మార్పులు చేసి మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తామని మున్సిపల్ అధ్యక్షురాలు తెలిపారు. ము న్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల మేరకు డీడీఎఫ్ సం స్థ ప్రతినిధులతో పట్టణ మాస్టర్ ప్లాన్ అమలుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ సిరాజొద్దిన్ మన్సూ ర్, కమిషనర్ సంపత్ కుమార్, డీడీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.

76
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles