పులిని వేటాడిన నారసింహుడు

Thu,February 21, 2019 12:26 AM

సారంగాపూర్ : బీర్‌పూర్ మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం అటవీ ప్రాంతంలో పార్వేట్ ఉత్సవం ఘనంగా జరిగింది. గ్రామ శివారులోని దట్టమైన అడవుల్లో లక్ష్మీనరసింహ స్వామి గుర్రంపై స్వారీ చేస్తూ ఆలయం నుంచి సుమా రు 2కిలో మీటర్ల దూరంలో ఉన్న గుట్టల వద్ద పులిని వేలాడి సంహరించే మహా సన్నివేశాన్ని నిర్వహించారు. ఎక్కడైతే ఆగుతానో అక్కడ వెలుస్తానని చెప్పి గుర్రంపై వేటకు వెళ్తుండగా, అరణ్యంలో గుట్ట వద్ద గుర్రం కాలు జారి బెనకడంతో తన గమ్యం ఇక్కడి వరకే అనుకొని వెనక్కి తిరిగి దగ్గరలోని ఉన్న చిన్న గుట్టపై లక్ష్మీన ర్సింహ స్వామిగా వెలిసినట్లు చరిత్ర ఆనవాళ్లు చెప్తున్నా యి. స్వామి వారి గుర్రపు కాళ్ల అచ్చులు ఉన్న ప్రాంతానికి స్వామి వారిని మేళతాళాలతో పల్లకిలో తీసుకువెళ్లి పులిని సంహరించే మహా ఘట్టాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. అలాగే చెంచులక్ష్మిని స్వామివారికి ఇచ్చి వివాహం చేసే కార్యక్రమాన్ని నిర్వహించి చరిత్రను భక్తులకు వివరించారు. ఆయా ప్రాంతాల నుంచి ఉత్సవాలను తిలకించేందుకు వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎంపీపీ కొల్ముల శారద, గ్రామ సర్పంచ్ గర్షకుర్తి శిల్ప, సింగిల్ విండో చైర్మన్ ముప్పాల రాంచందర్ రావు, ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్, ఎస్‌ఐ శంకర్ నాయక్, మాజీ జడ్పీ సభ్యులు ముప్పాల జలజ, కొల్ముల రమణ, నాయకులు ఆంజనేయులు, గొడుగు కేశవులు, రమణరావు, చంద్రశేఖర్ రావు, కృష్ణరావు, శేఖర్, రమేశ్, శ్రీనివాస్, రాము, లక్ష్మణ్, వినోద్, వెంకటేశ్, వేద పండితులు ఒద్దిపర్తి రామాచార్యులు, ఒద్దిపర్తి సంతోష్ కుమార్, ఒద్దిపర్తి చిన్న సంతోష్ కుమార్, ఒద్దిపర్తి మధుకుమార్, ఒద్దిపర్తి లక్ష్మణామూర్తి శర్మ, వంశీకృష్ణ, ఆలయ సిబ్బంది, ఆయా గ్రామాల నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles