పేద విద్యార్థినులకు సైకిళ్లు వితరణ..

Wed,February 20, 2019 01:33 AM

జగిత్యాల టౌన్ : పోషణ బాధ్యత చూసే తల్లి మరణించడం, తరచూ అనారోగ్యంతో బాధ పడుతున్న తండ్రితో కలిసి గుడిసెలో ఉంటూ ఆర్థి క ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులకు ధర్మపు రికి చెందిన వేద పండితుడు పాలేపు కేదారనాథ్ రెండు సైకిళ్లను విరాళంగా అందజేశారు. మేడిపల్లి మండలం కొండాపూర్‌కు చెందిన గడుగు లక్ష్మీ రాజం, లక్ష్మి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, పెద్ద కూతురు రస్న 10వ తరగతి, రవిత్రిని 5వ తరగతి, రావర్శిని ఎల్‌కేజీ చదువుతున్నారు. ఇటీ వల తల్లి మృతి చెందడంతో ఆర్థికంగా ఇబ్బం దులు పడుతున్న వీరి దీన స్థితిని వివరిస్తూ ధర్మపు రికి చెందని సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ ఈ నెల 2న ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసి ఇంటి ని ర్మా ణంతో పాటు పిల్లలకు 2 సైకిళ్లకు విరాళాలు అంద జేశారు. బొంబాయిలో ఉంటున్న ధర్మపురికి చెం దిన వేద పండితుడు పాలెపు కేదారనాథ్ స్పం దించి రెండు సైకిళ్లను కొనుగోలు చేసి జగిత్యాలలో సదరు విద్యార్థినులకు అందజేశారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles