జవాన్ల త్యాగం వెలకట్టలేనిది


Tue,February 19, 2019 01:03 AM

-పుల్వామా ఘటన తీవ్రంగా కలిచివేసింది
-ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
-బాధిత కుటుంబాలకు రూ.50వేల విరాళం
-మరో రూ.41,122 అందజేసిన కోరుట్ల మున్సిపల్ ఉద్యోగులు
-పట్టణంలో భారీ శాంతి ర్యాలీ
కోరుట్లటౌన్ : దేశ రక్షణలో అసువులు బాసిన జావన్ల తాగ్యాలు వెలకట్టలేనివని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. పట్టణంలో సోమవారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో కశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జనాన్ల ఆత్మకు శాంతి చేకూరని కోరుతూ ఏర్పాటు చేసిన శాంతియుత ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్బంగా మున్సిపల్ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్, జాతీయ రహదారి మీదుగా కార్గిల్ చౌక్ వరకు నిర్వహించిన ర్యాలీకి వందలాది మంది పట్టణ పౌరులు, కుల, యువజన సంఘాల సభ్యులు, వివి ధ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. దారి పొడవునా తీవ్రవాదులు, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసి, అమరువీరులకు జోహార్లర్పించారు. అనంతరం కార్గిల్ చౌక్ వద్ద అమర జ వాన్లకు పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మున్సిపల్ అధ్యక్షుడు గడ్డమీది పవన్, కమిషనర్ వాణిరెడ్డి, సీఐ సతీశ్ చందర్‌రావు ఘన నివాళుర్పించారు.


పుల్వామా ఘటనలో అమరులైన జవాన్ కుటుంబాలకు రూ.50వేలు విరాళంగా అందించనున్నట్లు ఎమ్మె ల్యే ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉగ్రదాడి ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రతి ఒక్కరు బాసటగా నిలువాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుంచి రూ.10లక్షలు విరాళంగా సేకరించి, సైనిక నిధికి పంపాలని విజ్ఞప్తి చేశారు. దాతలు విరాళాలు చెల్లించి, మున్సిపల్ కార్యాలయంలో రశీదు పొందవచ్చన్నారు. బాధిత సైనిక కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చి దేశభక్తిని చాటుకోవాలని కోరగా, పలువురు కౌన్సిలర్లు, వ్యాపారులు ముందుకు వచ్చారు. అంతకుముందు స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల మైనార్టీ విద్యార్థులు, మహిళా సంఘాల సభ్యులు, అధ్యాపకులు, అమరజవాన్లకు నివాళులర్పించారు. మున్సిపల్ కౌన్సిలర్లు, యువజన సంఘాల ప్రతినిధులు, టీఆర్‌ఎస్ యూత్ నాయకులు, మహిళా సంఘాల నాయకురాళ్లు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఎన్‌సీసీ ఆధ్వర్యంలో..
జగిత్యాల లీగల్ : జగిత్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల ఎన్‌సీసీ ఆధ్వర్యంలో పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని దేశం నుంచి తరిమికొట్టాలని, దానికి యువత జాగృతం కావాలని నినాదా లు చేస్తూ జిల్లా కేంద్రంలోని వాణినగర్ నుంచి కొత్త బస్టాం డ్ మీదుగా పాత బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు. అనంతరం ఎయిర్‌ఫోర్స్ విభాగం సార్జెంట్ భానుచంద్ర, ఆర్మీ అధికారి బీహెచ్‌ఎం లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ యువత నిరుద్యోగంతో ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారని, ఇది సరికాదన్నారు. యువత మేల్కొని భారతదేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ రాజేందర్, ఎన్‌సీసీ అధికారి లెఫ్టినెంట్ శ్రీహరిరావు, కేర్‌టేకర్ ఎన్.వనిత, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

97

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles